(॥పల్లవి॥)
మఱి ఇంతేకదవయ్య మనలో మాట
తఱితో సరివచ్చె మీ తగవులు చూచి
(॥మఱి॥)
కలసెఁగా ఆపె నిన్ను కాఁగిటిరతులనెల్లా
తెలిసెఁగా నీమహిమ తెల్లమిగాను
వలసలినట్లనయ్యీ వారివారి భాగ్యాలు
చలివాసె మాకైతే మీసరితలు చూచి
(॥మఱి॥)
మెచ్చెగా ఆపె నీమేలము లన్నిటికిని
యిచ్చితివిగా చనవు యిందరిలోన
విచ్చనవిడాయ నిఁక వెలఁదులవలపులు
ముచ్చట వాసె మాను నీ మోహములు చూచి
(॥మఱి॥)
పండెఁగా ఆపెతపము పక్కన నీకూటమిని
నిండెఁగా సంతోసాలు నీమతిలోన
అండగా శ్రీవేంకటేశ అందరి కివే చాళ్లు
దండేయ మాకు మీలోనితరితీపు చూచి
(||pallavi||)
maṟi iṁtegadavayya manalo māḍa
taṟido sarivachchĕ mī tagavulu sūsi
(||maṟi||)
kalasĕm̐gā ābĕ ninnu kām̐giḍiradulanĕllā
tĕlisĕm̐gā nīmahima tĕllamigānu
valasalinaṭlanayyī vārivāri bhāgyālu
salivāsĕ māgaide mīsaridalu sūsi
(||maṟi||)
mĕchchĕgā ābĕ nīmelamu lanniḍigini
yichchidivigā sanavu yiṁdarilona
vichchanaviḍāya nim̐ka vĕlam̐dulavalabulu
muchchaḍa vāsĕ mānu nī mohamulu sūsi
(||maṟi||)
paṁḍĕm̐gā ābĕdabamu pakkana nīgūḍamini
niṁḍĕm̐gā saṁtosālu nīmadilona
aṁḍagā śhrīveṁkaḍeśha aṁdari kive sāḽlu
daṁḍeya māgu mīlonidaridību sūsi