మఱచితివేమో కాక మగువలనెల్లాఁ జూచి
(॥పల్లవి॥)
మఱచితివేమో కాక మగువలనెల్లాఁ జూచి
మెఱయఁగ నీచేఁతలు మెచ్చనా నేను
(॥మఱ॥)
నెప్పున మాయింటికినిన్నిట్టె విచ్చేయుమని
అప్పుడే చెలిచేఁ జెప్పియంపనా నీకు
కొప్పు దువ్వుకొంటాను కుందనపు మేడమీఁద
చిప్పిలుమోవిని సన్నసేయనా నీకు
(॥మఱ॥)
మనసులో పొఁ(పొం?) దులు మరి యెచ్చరికగాను
మునుకొని చేతులెత్తి మొక్కనా నీకు
నొనుగకుండా నిన్ను పువ్వులచెండున వేసి
నినువుగా తమియెలా నించనానీకు
(॥మఱ॥)
పాటించి నాచన్నులు పయ్యద జారఁగ(గఁ?) దీసి
సూటిగఁ గానుకగాను చూపనా నీకు
యీటున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
గాఁటవునామేలు తారుకాణించనా నీకు
(||pallavi||)
maṟasidivemo kāga maguvalanĕllām̐ jūsi
mĕṟayam̐ga nīsem̐talu mĕchchanā nenu
(||maṟa||)
nĕppuna māyiṁṭigininniṭṭĕ vichcheyumani
appuḍe sĕlisem̐ jĕppiyaṁpanā nīgu
kŏppu duvvugŏṁṭānu kuṁdanabu meḍamīm̐da
sippilumovini sannaseyanā nīgu
(||maṟa||)
manasulo pŏm̐(pŏṁ?) dulu mari yĕchcharigagānu
munugŏni sedulĕtti mŏkkanā nīgu
nŏnugaguṁḍā ninnu puvvulasĕṁḍuna vesi
ninuvugā tamiyĕlā niṁchanānīgu
(||maṟa||)
pāḍiṁchi nāsannulu payyada jāram̐ga(gam̐?) dīsi
sūḍigam̐ gānugagānu sūbanā nīgu
yīḍuna śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
gām̐ṭavunāmelu tārugāṇiṁchanā nīgu