Marali yebaniyaina mammadugave | meeru

మరలి యేపనియైన మమ్మడుగవే । మీరు
Language

(॥పల్లవి॥)
మరలి యేపనియైన మమ్మడుగవే । మీరు
గరిమ గలసి ఇంకా గలవా యెన్నికలు

(॥మర॥)
కామిని నీపతి నీతోఁ గడుసరసమాడితే
యేమే నామోము చూచే వింతలోన
యేమేమో మీలో సుద్ది మీరిద్దరే యెరుఁగుదురు
కాముని తంత్రములపైఁ గలవా యెన్నకలు

(॥మర॥)
కలికి నీపతిఁ నీతోఁ గన్నులనే నవ్వితేనే
యెలమిఁ జెలులము నే మేమిసేతుమే
నెలనైనమీసన్నలు నేఁడు మీకే తెలుసును
కలిమి పూబాణాలపైఁ గలవా యెన్నికలు

(॥మర॥)
యీకడ శ్రీవేంకటేశుఁ డింతి నిన్నుఁ గూడితేనే
మేకొని మమ్మెల్లా నీవు మెచ్చేవేమే
యేకమైనరతుల మీరిద్దరునుఁ గంకణాలు
గైకొని కట్టినమీఁద గలవా యెన్నికలు

(||pallavi||)
marali yebaniyaina mammaḍugave | mīru
garima galasi iṁkā galavā yĕnnigalu

(||mara||)
kāmini nībadi nīdom̐ gaḍusarasamāḍide
yeme nāmomu sūse viṁtalona
yememo mīlo suddi mīriddare yĕrum̐guduru
kāmuni taṁtramulabaim̐ galavā yĕnnagalu

(||mara||)
kaligi nībadim̐ nīdom̐ gannulane navvidene
yĕlamim̐ jĕlulamu ne memisedume
nĕlanainamīsannalu nem̐ḍu mīge tĕlusunu
kalimi pūbāṇālabaim̐ galavā yĕnnigalu

(||mara||)
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁti ninnum̐ gūḍidene
megŏni mammĕllā nīvu mĕchcheveme
yegamainaradula mīriddarunum̐ gaṁkaṇālu
gaigŏni kaṭṭinamīm̐da galavā yĕnnigalu