Mannimchumgaaga vatti maramgulele

మన్నించుఁగాక వట్టి మరఁగులేలే
Language

(॥పల్లవి॥)
మన్నించుఁగాక వట్టి మరఁగులేలే
తిన్నని నా గుణాలివి తెలుసుకొమ్మనవే

(॥మన్నించు॥)
మొగము చూచినప్పుడే మునుకొనె నాసలు
నగినప్పుడే వెలసె ననుపులెల్లా
తగిలి మాఁటాడితేనే తలపోఁత లీడేరె
మగఁడాయ నాకుఁ దాను మనసేమి చూచీనే

(॥మన్నించు॥)
సరుసఁ గూచున్నప్పుడే జంటాయఁ జుట్టరికము
తెరదీసినప్పుడే పొందిక లమరె
సరసమాడినప్పుడే సతమాయ భోగములు
మరుతంత్రములతోడ మనసేమి చూచీనే

(॥మన్నించు॥)
మేనులు సోఁకినప్పుడే మేరసె సంతోసము
తేనె మోవిచ్చినప్పుడే తేరెఁ బనులు
తానె వచ్చి నన్నుఁ గూడె తగ శ్రీవేంకటేశుఁడు
మానాపతినైన నా మనసేమి చూచీనే

(||pallavi||)
manniṁchum̐gāga vaṭṭi maram̐gulele
tinnani nā guṇālivi tĕlusugŏmmanave

(||manniṁchu||)
mŏgamu sūsinappuḍe munugŏnĕ nāsalu
naginappuḍe vĕlasĕ nanubulĕllā
tagili mām̐ṭāḍidene talabom̐ta līḍerĕ
magam̐ḍāya nāgum̐ dānu manasemi sūsīne

(||manniṁchu||)
sarusam̐ gūsunnappuḍe jaṁṭāyam̐ juṭṭarigamu
tĕradīsinappuḍe pŏṁdiga lamarĕ
sarasamāḍinappuḍe sadamāya bhogamulu
marudaṁtramuladoḍa manasemi sūsīne

(||manniṁchu||)
menulu som̐kinappuḍe merasĕ saṁtosamu
tenĕ movichchinappuḍe terĕm̐ banulu
tānĕ vachchi nannum̐ gūḍĕ taga śhrīveṁkaḍeśhum̐ḍu
mānābadinaina nā manasemi sūsīne