మన్నించుమనవే మమ్మేల పైకొనుమనీ
(॥పల్లవి॥)
మన్నించుమనవే మమ్మేల పైకొనుమనీ
చన్నుల నొత్తఁగాను చలము లెట్లుండునో
(॥మన్నిం॥)
తప్పక తనుఁ జూచితే తనువెల్లాఁ జెమరించె
యిప్పుడే మేలమాడితే నెట్లుండునో
చిప్పిల వొద్దికి రాఁగా సిగ్గులెల్లా వెడజారె
తప్పి చేయి దాఁకితేను తమకా లెట్లుండునో
(॥మన్నిం॥)
మంచిమాఁటలాడితేను మనసెల్లా వెరగందె
యుంక కొంగు వట్టితే యెట్లుండునో
వంచనతో నొరసితే వలపులు చిమ్మిరేఁగె
కంచముపొత్తుకు రాఁగా కాంక్ష లెల్లుండునో
(॥మన్నిం॥)
సెలవి నవ్వు నవ్వితే చెక్కులెల్లాఁ బులకించె
యెలమిఁగాఁగిలించితే నెట్టుండునో
అలరి శ్రీవేంకటేశుఁడంతలోనె నన్నుఁగూడె
బలిమి సేయఁగబోతే పంతము లెట్లుండునో
(||pallavi||)
manniṁchumanave mammela paigŏnumanī
sannula nŏttam̐gānu salamu lĕṭluṁḍuno
(||manniṁ||)
tappaga tanum̐ jūside tanuvĕllām̐ jĕmariṁchĕ
yippuḍe melamāḍide nĕṭluṁḍuno
sippila vŏddigi rām̐gā siggulĕllā vĕḍajārĕ
tappi seyi dām̐kidenu tamagā lĕṭluṁḍuno
(||manniṁ||)
maṁchimām̐ṭalāḍidenu manasĕllā vĕragaṁdĕ
yuṁka kŏṁgu vaṭṭide yĕṭluṁḍuno
vaṁchanado nŏraside valabulu simmirem̐gĕ
kaṁchamubŏttugu rām̐gā kāṁkṣha lĕlluṁḍuno
(||manniṁ||)
sĕlavi navvu navvide sĕkkulĕllām̐ bulagiṁchĕ
yĕlamim̐gām̐giliṁchide nĕṭṭuṁḍuno
alari śhrīveṁkaḍeśhum̐ḍaṁtalonĕ nannum̐gūḍĕ
balimi seyam̐gabode paṁtamu lĕṭluṁḍuno