(॥పల్లవి॥)
మన్నించవయ్యా యిఁక మగువను
సన్నలనే మాకుఁ జెప్పీ సంతము సేయుమని
(॥మన్నిం॥)
పయ్యదచెమటఁ దోఁగి బయటఁబడెఁ జన్నులు
మొయ్యెఁ(య్యఁ?) జొచ్చె సిగ్గువడి ముంజేతులను
కొయ్యతనాన నంతలో గోర గీరేవు చెక్కులు
ఇయ్యడఁ దప్పించుకొనే వెందుకౌను చెలియ
(॥మన్నిం॥)
వూరుపుగాలికి చీర వొడిసి తొడ గాన్పించె
ఆరసి సిగ్గున మూసీ నరచేతుల
కేరడాన నంతలో గిలిగించేవు సందులు
యీరీతిఁ దప్పించుకొని యెన్నికౌఁ జెలియ
(॥మన్నిం॥)
పులకల నిబ్బరాన పోఁకముడి వీడెను
కులికి సిగ్గునఁ బట్టె కొనచేతుల
అలరి శ్రీవేంకటేశ అంతలోనె కూడితివి
యెలిమి నవ్వులు నవ్వి యేమిటికౌఁజ(జె)లియ
(||pallavi||)
manniṁchavayyā yim̐ka maguvanu
sannalane māgum̐ jĕppī saṁtamu seyumani
(||manniṁ||)
payyadasĕmaḍam̐ dom̐gi bayaḍam̐baḍĕm̐ jannulu
mŏyyĕm̐(yyam̐?) jŏchchĕ sigguvaḍi muṁjedulanu
kŏyyadanāna naṁtalo gora gīrevu sĕkkulu
iyyaḍam̐ dappiṁchugŏne vĕṁdugaunu sĕliya
(||manniṁ||)
vūrubugāligi sīra vŏḍisi tŏḍa gānpiṁchĕ
ārasi sigguna mūsī narasedula
keraḍāna naṁtalo giligiṁchevu saṁdulu
yīrīdim̐ dappiṁchugŏni yĕnnigaum̐ jĕliya
(||manniṁ||)
pulagala nibbarāna pom̐kamuḍi vīḍĕnu
kuligi siggunam̐ baṭṭĕ kŏnasedula
alari śhrīveṁkaḍeśha aṁtalonĕ kūḍidivi
yĕlimi navvulu navvi yemiḍigaum̐ja(jĕ)liya