Manasugu manase mari taarugaanagaadaa

మనసుకు మనసే మరి తారుకాణగాదా
Language

(॥పల్లవి॥)
మనసుకు మనసే మరి తారుకాణగాదా
నిను నే నింతేసి తా నేరము లెన్నితిని

(॥మన॥)
చెలరేఁగి నీ విక్కడఁ జింతించే వెవ్వతెనో
తలఁపులో నాపె నిన్నుఁ దలఁచఁబోలు
పులకించె నీమేను పొంచి యూరకుండి యుండి
మెలుఁత జాజిననలు మీఁదెత్తఁబోలును

(॥మన॥)
కోరి యెవ్వెతనో నోర గుణించుకొనేవు నీవు
పేరుకొని యాపె నాడఁ బిలువఁబోలు
పేరడిగా నీచెక్కులఁ బెంజెమటలు గారీ
యేరీతినో పన్నీరు నీ కెక్కించఁబోలును

(॥మన॥)
చెంది యెవ్వతెకుఁగానో సెలవుల నవ్వేవు
కందువ నిన్నాపె నవ్వెఁగాఁబోలును
అందపు శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
పొందితి నన్నాకె నీకుఁ బూఁచుకుండఁబోలును

(||pallavi||)
manasugu manase mari tārugāṇagādā
ninu ne niṁtesi tā neramu lĕnnidini

(||mana||)
sĕlarem̐gi nī vikkaḍam̐ jiṁtiṁche vĕvvadĕno
talam̐pulo nābĕ ninnum̐ dalam̐sam̐bolu
pulagiṁchĕ nīmenu pŏṁchi yūraguṁḍi yuṁḍi
mĕlum̐ta jājinanalu mīm̐dĕttam̐bolunu

(||mana||)
kori yĕvvĕdano nora guṇiṁchugŏnevu nīvu
perugŏni yābĕ nāḍam̐ biluvam̐bolu
peraḍigā nīsĕkkulam̐ bĕṁjĕmaḍalu gārī
yerīdino pannīru nī kĕkkiṁcham̐bolunu

(||mana||)
sĕṁdi yĕvvadĕgum̐gāno sĕlavula navvevu
kaṁduva ninnābĕ navvĕm̐gām̐bolunu
aṁdabu śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
pŏṁdidi nannāgĕ nīgum̐ būm̐suguṁḍam̐bolunu