మనసు రానిది యాల మానఁగరాదా
(॥పల్లవి॥)
మనసు రానిది యాల మానఁగరాదా
చనవిచ్చి నాకు వేరే సతులఁ దేవలెనా
(॥మన॥)
పొమ్మనఁగ రాదా పోయేము మాయింటికి
దిమ్ములమాటల వాదుదియ్యవలెనా
వుమ్మడి నుండనీరాదా వుండేము మాయింటిలోనే
కమ్మటిని వచ్చి వచ్చి కాఁకరేఁచవలెనా
(॥మన॥)
మోనాన నుండనీరాదా మొక్కేము నీకాళ్ళకు
నానఁ బెట్టి వలపులు నగవలెనా
నే నొల్లననరాదా నిన్నే మీ ననరాను
ఆన వెట్టించుక నన్ను నణఁకించవలెనా
(॥మన॥)
చేసన్న చేయరాదా చేరి అప్పుడే కలతు
యీసురేఁచి యింతవడి నేఁపవలెనా
వాసికి శ్రీవేంకటుశ వద్దనక కూడితివి
యీసరి నితరకాంత లిఁకమీఁద వలెనా
(||pallavi||)
manasu rānidi yāla mānam̐garādā
sanavichchi nāgu vere sadulam̐ devalĕnā
(||mana||)
pŏmmanam̐ga rādā poyemu māyiṁṭigi
dimmulamāḍala vādudiyyavalĕnā
vummaḍi nuṁḍanīrādā vuṁḍemu māyiṁṭilone
kammaḍini vachchi vachchi kām̐karem̐savalĕnā
(||mana||)
monāna nuṁḍanīrādā mŏkkemu nīgāḽḽagu
nānam̐ bĕṭṭi valabulu nagavalĕnā
ne nŏllananarādā ninne mī nanarānu
āna vĕṭṭiṁchuga nannu naṇam̐kiṁchavalĕnā
(||mana||)
sesanna seyarādā seri appuḍe kaladu
yīsurem̐si yiṁtavaḍi nem̐pavalĕnā
vāsigi śhrīveṁkaḍuśha vaddanaga kūḍidivi
yīsari nidaragāṁta lim̐kamīm̐da valĕnā