పల్లవి:
తాగితే మరచిపోగలను... తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే ...
చరణం 1:
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ!
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే !!!
చరణం 2:
అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ !
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే !!!
చరణం 3:
మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా !
మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే.. మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే !
pallavi:
tāgide marasibogalanu... tāganivvadu
marsibode tāgagalanu... maruvanivvadu
manasu gadi iṁte maniṣhi bradugiṁte
manasunna maniṣhigī sukhamu ledaṁte
manasu gadi iṁte maniṣhi bradugiṁte
manasunna maniṣhigī sukhamu ledaṁte
manasu gadi iṁte ...
saraṇaṁ 1:
ŏgarigiste marali rādū ..oḍibode marisibodū
ŏgarigiste marali rādū ..odiḍibode marisibodū
gāyamaide māsibodū ... pagilibode adugubaḍadū!
manasu gadi iṁte ..maniṣhi bradugiṁte..manasu gadi iṁte !!!
saraṇaṁ 2:
aṁtā maṭṭenani tĕlusū... adī ŏga māyenani tĕlusū
aṁtā maṭṭenani tĕlusū ... adī ŏga māyenani tĕlusū
tĕlisī valasī vilabiṁchuḍalo ... tīyadanaṁ ĕvarigi tĕlusū !
manasu gadi iṁte ..maniṣhi bradugiṁte...manasu gadi iṁte !!!
saraṇaṁ 3:
marujanma unnado ledo ...ī mamadalappuḍemaudāyo
marujanma unnado ledo ... ī mamadalappuḍemaudāyo
maniṣhigi manase tīrani śhikṣhā... devuḍilā tīrsugunnāḍu kakṣhā !
manasu gadi iṁte ..maniṣhi bradugiṁte.. manasunna maniṣhigī sukhamu ledaṁte
manasu gadi iṁte !