మనలో నెక్కడివిఁక మంకుదనాలు
(॥పల్లవి॥)
మనలో నెక్కడివిఁక మంకుదనాలు
చనవులు గలవారు చలపట్టరు
(॥మన॥)
వొలిసినవారు తమవోరుపే నెరపుదురు
యెలమి నేమిసేసినా యెగ్గుపట్టరు
కలసినవారు లోలో కరఁగుదురు చిత్తాలు
కొలఁదిమీరివచ్చిన కోపగించరు
(॥మన॥)
కూడినట్టివారు మంచిగుణములే నింతురు
వీడ నెంత ఆడినాను వేసారరు
వేడుకగలుగువారు వీడుదోడు లాడుదురు
పాడి దప్పి యించుకంటా పంతమాడరు
(॥మన॥)
ననుపులుగలవారు నవ్వులే నవ్వుదురు
తనువులు సోఁకినాను తమకించరు
యెనసితిమి శ్రీవేంకటేశ మనమిద్దరము
ఘనులయినవారిట్లా గతి గూడుకొందురు
(||pallavi||)
manalo nĕkkaḍivim̐ka maṁkudanālu
sanavulu galavāru salabaṭṭaru
(||mana||)
vŏlisinavāru tamavorube nĕrabuduru
yĕlami nemisesinā yĕggubaṭṭaru
kalasinavāru lolo karam̐guduru sittālu
kŏlam̐dimīrivachchina kobagiṁcharu
(||mana||)
kūḍinaṭṭivāru maṁchiguṇamule niṁturu
vīḍa nĕṁta āḍinānu vesāraru
veḍugagaluguvāru vīḍudoḍu lāḍuduru
pāḍi dappi yiṁchugaṁṭā paṁtamāḍaru
(||mana||)
nanubulugalavāru navvule navvuduru
tanuvulu som̐kinānu tamagiṁcharu
yĕnasidimi śhrīveṁkaḍeśha manamiddaramu
ghanulayinavāriṭlā gadi gūḍugŏṁduru