మంతనాన న న్నిట్టె మన్నించుఁగాక
(॥పల్లవి॥)
మంతనాన న న్నిట్టె మన్నించుఁగాక
సంతతమూఁ జెక్కునొక్కి సరస మేమాడీనే
(॥మంత॥)
చిగిరించె వలపులు చేగలెక్కెఁదమకము
నగుతా నాతో నెంత నాని సేసేసీనే
తగులాయ వావులు తతివచ్చె జవ్వనము
యెగసక్కేలకు నేల యెడబాఁటలాడీనే
(॥మంత॥)
పచ్చిదేరెఁజిత్త మిదె పదనెక్కెఁ దనువల్లి
కొచ్చి కొచ్చి నాతో నెంత గుట్టు చూపీనే
పెచ్చురేఁగెఁ గోరికలు పెనగొనెఁ బ్రియములు
తచ్చి తచ్చి మరి యాల తరితీపు సేసీనే
(॥మంత॥)
నమ్మికలు తుదకెక్కె నారుకొనెఁ బులకలు
కమ్మటి సిగ్గు లివేల కప్పవచ్చీనే
నెమ్మదిఁ గాఁగిటఁ గూడె నేఁడు శ్రీవేంకటేశుఁడు
వుమ్మడి సారెకు నేమి వొడివట్టీనే
(||pallavi||)
maṁtanāna na nniṭṭĕ manniṁchum̐gāga
saṁtadamūm̐ jĕkkunŏkki sarasa memāḍīne
(||maṁta||)
sigiriṁchĕ valabulu segalĕkkĕm̐damagamu
nagudā nādo nĕṁta nāni sesesīne
tagulāya vāvulu tadivachchĕ javvanamu
yĕgasakkelagu nela yĕḍabām̐ṭalāḍīne
(||maṁta||)
pachchiderĕm̐jitta midĕ padanĕkkĕm̐ danuvalli
kŏchchi kŏchchi nādo nĕṁta guṭṭu sūbīne
pĕchchurem̐gĕm̐ gorigalu pĕnagŏnĕm̐ briyamulu
tachchi tachchi mari yāla taridību sesīne
(||maṁta||)
nammigalu tudagĕkkĕ nārugŏnĕm̐ bulagalu
kammaḍi siggu livela kappavachchīne
nĕmmadim̐ gām̐giḍam̐ gūḍĕ nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
vummaḍi sārĕgu nemi vŏḍivaṭṭīne