మమ్మునేమి యడిగేవు మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మమ్మునేమి యడిగేవు మాపు దాఁకాను
సమ్మతిగా సేసలు చల్లుకోరాదా
(॥మమ్ము॥)
చెలికి వలతువట చెప్పనేల నీసుద్దులు
కలయ నీవాడకు గక్కన రారాదా
కలిమిని యాపెవుంగరము నీచేతనుంటే
తెలువనేల వావి గద్దియపై నుండరాదా
(॥మమ్ము॥)
అగనకు బాసయిస్తివట మరేల సిగ్గులు
యింగిత యెఱిఁగి విడెమియ్యరాదా
ముంగిటినీమోవిమీఁద మొల చాపెగురి వుంటే
సంగతిగ నట్టే పంపు సారెఁ జేయరాదా
(॥మమ్ము॥)
అతివఁ గూడితివట అప్పటినేల మరపు
రతులచవులెల్లా మరపఁగరాదా
యితవై శ్రీవేంకటేశ ఇద్దరూ నెనసివుంటే
సతమై రాజ్యమేలుచు చనవియ్యరాదా
(||pallavi||)
mammunemi yaḍigevu mābu dām̐kānu
sammadigā sesalu sallugorādā
(||mammu||)
sĕligi valaduvaḍa sĕppanela nīsuddulu
kalaya nīvāḍagu gakkana rārādā
kalimini yābĕvuṁgaramu nīsedanuṁṭe
tĕluvanela vāvi gaddiyabai nuṁḍarādā
(||mammu||)
aganagu bāsayistivaḍa marela siggulu
yiṁgida yĕṟim̐gi viḍĕmiyyarādā
muṁgiḍinīmovimīm̐da mŏla sābĕguri vuṁṭe
saṁgadiga naṭṭe paṁpu sārĕm̐ jeyarādā
(||mammu||)
adivam̐ gūḍidivaḍa appaḍinela marabu
radulasavulĕllā marabam̐garādā
yidavai śhrīveṁkaḍeśha iddarū nĕnasivuṁṭe
sadamai rājyamelusu sanaviyyarādā