మమ్మునేల దూరేవే మాఁటిమాఁటికి
(॥పల్లవి॥)
మమ్మునేల దూరేవే మాఁటిమాఁటికి
చిమ్మి యిట్టె చెనకఁగ సిగ్గుపడఁగలమా
(॥మమ్ము॥)
వలసినట్టెల్లా నీవు వరము లిప్పించుకోవే
యెలమి సవతుల నీ వేలేనంటా
కలిగినట్టెల్లా నీవు కాఁపిరాలు సేయవే
వలచి నీయింటికి వచ్చినవిభునిని
(॥మమ్ము॥)
పెక్కుమారు లట్టె నీవు ప్రియాలు చెప్పించుకొవే
వెక్కసపుటెమ్ములతో వెలసేనంటా
మొక్కులు మొక్కించుకొని మోహములు చల్లవే
పిక్కటిల్లుఁదమకాన పెండ్లాడినవానిని
(॥మమ్ము॥)
సంతమువచ్చినట్టెల్లా పనులు సేయించుకోవే
చెంత నీచెప్పినట్టె సేసేనఁటా
యింతలో శ్రీవేంకటేశుఁ డీడ నిట్టె నన్నుఁ గూడె
వంతులు వెట్టవే నీవు వద్దనున్న వానిని
(||pallavi||)
mammunela dūreve mām̐ṭimām̐ṭigi
simmi yiṭṭĕ sĕnagam̐ga siggubaḍam̐galamā
(||mammu||)
valasinaṭṭĕllā nīvu varamu lippiṁchugove
yĕlami savadula nī velenaṁṭā
kaliginaṭṭĕllā nīvu kām̐pirālu seyave
valasi nīyiṁṭigi vachchinavibhunini
(||mammu||)
pĕkkumāru laṭṭĕ nīvu priyālu sĕppiṁchugŏve
vĕkkasabuḍĕmmulado vĕlasenaṁṭā
mŏkkulu mŏkkiṁchugŏni mohamulu sallave
pikkaḍillum̐damagāna pĕṁḍlāḍinavānini
(||mammu||)
saṁtamuvachchinaṭṭĕllā panulu seyiṁchugove
sĕṁta nīsĕppinaṭṭĕ sesenam̐ṭā
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍīḍa niṭṭĕ nannum̐ gūḍĕ
vaṁtulu vĕṭṭave nīvu vaddanunna vānini