మమ్ము మన్నించి విచ్చేయు మగువకడకె నీవు
(॥పల్లవి॥)
మమ్ము మన్నించి విచ్చేయు మగువకడకె నీవు
కమ్మర నన్నంటకు నీ కపటమే యెఱుఁగు
(॥మమ్ము॥)
తిలకించి చూచె నినుఁ దేరకొన దేఁటికో
చెలికన్ను లెఱఁగు నీచిత్త మెఱుఁగు
పిలిచె నూరక నిన్ను బిగువున నేఁటికో
మలయుమో వెఱఁగు నీమర్మమే యెఱుఁగు
(॥మమ్ము॥)
పక్కన నవ్వె నదె పడఁతి యదేఁటికో
చెక్కు సెలవు లెఱుఁగు సిగ్గు లెఱుఁగు
అక్కడఁ జేనన్న సేసె నతివ యదేఁటికొ
నిక్కుఁబాయ మెఱుఁగు నీనిండుమోహ మెఱుఁగు
(॥మమ్ము॥)
పూవులచెండున వేసె పొలఁతి యదేఁటికో
తావులచే యెఱుఁగు నీతను వెఱుఁగు
యీవల శ్రీవేంకటేశ ఇద్దరిఁ గూడితి విట్టె
కావరపుగుణములు కంతుఁడే యెఱుఁగు
(||pallavi||)
mammu manniṁchi vichcheyu maguvagaḍagĕ nīvu
kammara nannaṁṭagu nī kabaḍame yĕṟum̐gu
(||mammu||)
tilagiṁchi sūsĕ ninum̐ deragŏna dem̐ṭigo
sĕligannu lĕṟam̐gu nīsitta mĕṟum̐gu
pilisĕ nūraga ninnu biguvuna nem̐ṭigo
malayumo vĕṟam̐gu nīmarmame yĕṟum̐gu
(||mammu||)
pakkana navvĕ nadĕ paḍam̐ti yadem̐ṭigo
sĕkku sĕlavu lĕṟum̐gu siggu lĕṟum̐gu
akkaḍam̐ jenanna sesĕ nadiva yadem̐ṭigŏ
nikkum̐bāya mĕṟum̐gu nīniṁḍumoha mĕṟum̐gu
(||mammu||)
pūvulasĕṁḍuna vesĕ pŏlam̐ti yadem̐ṭigo
tāvulase yĕṟum̐gu nīdanu vĕṟum̐gu
yīvala śhrīveṁkaḍeśha iddarim̐ gūḍidi viṭṭĕ
kāvarabuguṇamulu kaṁtum̐ḍe yĕṟum̐gu