Mamdulu maamkulu maṟiyelaa

మందులు మాఁకులు మఱియేలా
Language

(॥పల్లవి॥)
మందులు మాఁకులు మఱియేలా
అందులనే గుణమయ్యీని

(॥మందు॥)
చుంగలనీతెలిచూపులు రమణుని-
కంగజబాణములయి తాఁకె
రంగగు వీడెపురసములకారము -
లెంగి లనక పతి కియ్యఁగరాదా

(॥మందు॥)
వెడ నీనవ్వులవెన్నెల విభునికి
వడిగల యండయి వడదాఁకె
అడరఁగ నతిరస మమృతరసాయనము
వొడలి కిత వతని కొసఁగఁగరాదా

(॥మందు॥)
చెలి నీకుచములు శ్రీవేంకటపతి -
కలయిక రుచులయి కళదాఁకె
కులికేటిగోళ్లకొనయెచ్చరికల
తెలియఁగ మఱపులు దెలుపఁగరాదా

(||pallavi||)
maṁdulu mām̐kulu maṟiyelā
aṁdulane guṇamayyīni

(||maṁdu||)
suṁgalanīdĕlisūbulu ramaṇuni-
kaṁgajabāṇamulayi tām̐kĕ
raṁgagu vīḍĕburasamulagāramu -
lĕṁgi lanaga padi kiyyam̐garādā

(||maṁdu||)
vĕḍa nīnavvulavĕnnĕla vibhunigi
vaḍigala yaṁḍayi vaḍadām̐kĕ
aḍaram̐ga nadirasa mamṛtarasāyanamu
vŏḍali kida vadani kŏsam̐gam̐garādā

(||maṁdu||)
sĕli nīgusamulu śhrīveṁkaḍabadi -
kalayiga rusulayi kaḽadām̐kĕ
kuligeḍigoḽlagŏnayĕchcharigala
tĕliyam̐ga maṟabulu dĕlubam̐garādā