Mamdulo mamtraalo neegu mari pampu sesugone

మందులో మంత్రాలో నీకు మరి పంపు చేసుకొనె
Language

(॥పల్లవి॥)
మందులో మంత్రాలో నీకు మరి పంపు చేసుకొనె
సందడి నీ పెండ్లాడిన సగినాలు మంచివే

(॥మందు॥)
చనవిచ్చినాఁడు, మోవిచవి నీకుఁ జూపినాఁడు
అనిశముఁబతి నీకు నచ్చివచ్చునే
య(యె?) వసి పాయఁడు నీఇచ్చలోనే మెలఁగును
పొనుఁగ కిద్దరికిని పొంతనాలు గూడునే

(॥మందు॥)
నెలవై ఇంట నున్నాఁడు నీమాటచెల్లించినాఁడు
వెలయ నీవు గూడినవేళ మంచిదే
సులభాన దక్కె నీకు చొక్కుచు నిన్ను మరిగె
బలిమి నీవునోమినఫలము లీడెరెనే

(॥మందు॥)
వేడుక వుట్టించి నాఁడు వెస నిన్నుఁ గూడినాఁడు
పాడిదప్ప కాతఁడు నీపాలిటివాఁడే
యీడనె శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
జోడైనచుట్టరికము సూటికెక్కెఁగదవే

(||pallavi||)
maṁdulo maṁtrālo nīgu mari paṁpu sesugŏnĕ
saṁdaḍi nī pĕṁḍlāḍina saginālu maṁchive

(||maṁdu||)
sanavichchinām̐ḍu, movisavi nīgum̐ jūbinām̐ḍu
aniśhamum̐badi nīgu nachchivachchune
ya(yĕ?) vasi pāyam̐ḍu nīichchalone mĕlam̐gunu
pŏnum̐ga kiddarigini pŏṁtanālu gūḍune

(||maṁdu||)
nĕlavai iṁṭa nunnām̐ḍu nīmāḍasĕlliṁchinām̐ḍu
vĕlaya nīvu gūḍinaveḽa maṁchide
sulabhāna dakkĕ nīgu sŏkkusu ninnu marigĕ
balimi nīvunominaphalamu līḍĕrĕne

(||maṁdu||)
veḍuga vuṭṭiṁchi nām̐ḍu vĕsa ninnum̐ gūḍinām̐ḍu
pāḍidappa kādam̐ḍu nībāliḍivām̐ḍe
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
joḍainasuṭṭarigamu sūḍigĕkkĕm̐gadave