Mamdemelaa lamarunaa maguvalagum badido

మందెమేళా లమరునా మగువలకుఁ బతితో
Language

(॥పల్లవి॥)
మందెమేళా లమరునా మగువలకుఁ బతితో
పొందులు మన కెప్పుడూఁ బొసఁగునేగాక

(॥మందె॥)
వినయముతో మొక్కి వేఁడుకొనఁగలఁగాక
చనవిచ్చితి వంటాను సాదించేనా
మనసారా నన్ను నేల మన్నించినవాఁడవు
వొసరి నాతలఁపులో నుండేవుగాక

(॥మందె॥)
ఇచ్చకములాడి నిన్ను నెనయఁగఁగలఁగాక
పచ్చిసేసి నీతోను పంతమాడేనా
అచ్చపు వేడుకతో నే నాలనైతి నీకుఁ దొల్లె
నిచ్చ నాపై నీకరుణ నేరపేవుగాక

(॥మందె॥)
సేవసేసి మెప్పించి చెనకఁగఁగలఁగాక
కావరించి పెనఁగుతా గద్దించేనా
యీవల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
తావుకొనఁ గూడితివి తగు లీడేరీఁగాక

(||pallavi||)
maṁdĕmeḽā lamarunā maguvalagum̐ badido
pŏṁdulu mana kĕppuḍūm̐ bŏsam̐gunegāga

(||maṁdĕ||)
vinayamudo mŏkki vem̐ḍugŏnam̐galam̐gāga
sanavichchidi vaṁṭānu sādiṁchenā
manasārā nannu nela manniṁchinavām̐ḍavu
vŏsari nādalam̐pulo nuṁḍevugāga

(||maṁdĕ||)
ichchagamulāḍi ninnu nĕnayam̐gam̐galam̐gāga
pachchisesi nīdonu paṁtamāḍenā
achchabu veḍugado ne nālanaidi nīgum̐ dŏllĕ
nichcha nābai nīgaruṇa nerabevugāga

(||maṁdĕ||)
sevasesi mĕppiṁchi sĕnagam̐gam̐galam̐gāga
kāvariṁchi pĕnam̐gudā gaddiṁchenā
yīvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
tāvugŏnam̐ gūḍidivi tagu līḍerīm̐gāga