మందలించి యతనికి మంచిదానివలెనే
(॥పల్లవి॥)
మందలించి యతనికి మంచిదానివలెనే
యిందులోనే చూపేవే ఇతవు లెల్లాను
(॥మంద॥)
అవ్వలి నీరమణుని నాడఁగలవెల్లా నాడి
నవ్వితిననే వవునే నాలికత్తెవు
పువ్వులను నొవ్వవేసి పుప్పొడి మోమునఁ జల్లి
నివ్వటిల్ల వసంతము నే నాడితిననవు
(॥మంద॥)
చెనకులు మేన నిండా సేయఁగలవెల్లాఁ జేసి
పెనఁగితి ననేవేమే బేసబెల్లివి
కొనచూపులనుఁ జూచి కొంగువట్టి చేతఁ దీసి
లనువుగా వేఁడుకొంటినని యాడేవేమే
(॥మంద॥)
అలయించి రతిఁగూడి అంగము లెంగిలిచేవి
వలచినజాడనేవే వైపులాఁడివి
యెలమి శ్రీవేంకటేశు నిటు నన్ను నొనగూర్చి
తెలిపి యందరికిని ద్రిష్టము చూపేవే
(||pallavi||)
maṁdaliṁchi yadanigi maṁchidānivalĕne
yiṁdulone sūbeve idavu lĕllānu
(||maṁda||)
avvali nīramaṇuni nāḍam̐galavĕllā nāḍi
navvidinane vavune nāligattĕvu
puvvulanu nŏvvavesi puppŏḍi momunam̐ jalli
nivvaḍilla vasaṁtamu ne nāḍidinanavu
(||maṁda||)
sĕnagulu mena niṁḍā seyam̐galavĕllām̐ jesi
pĕnam̐gidi naneveme besabĕllivi
kŏnasūbulanum̐ jūsi kŏṁguvaṭṭi sedam̐ dīsi
lanuvugā vem̐ḍugŏṁṭinani yāḍeveme
(||maṁda||)
alayiṁchi radim̐gūḍi aṁgamu lĕṁgilisevi
valasinajāḍaneve vaibulām̐ḍivi
yĕlami śhrīveṁkaḍeśhu niḍu nannu nŏnagūrsi
tĕlibi yaṁdarigini driṣhṭamu sūbeve