Mamchivaanivalene maadalaadevu

మంచివానివలెనే మాటలాడేవు
Language

(॥పల్లవి॥)
మంచివానివలెనే మాటలాడేవు
అంచెల వచ్చితి విట్టే ఆ(ఆ?)ప్పు డెందువోయేవు

(॥మంచి॥)
చింతతో నే నుండఁగాను చెవిలో నేకతమాడే-
వెంతలేదు నీవలపు యేమిచెప్పేది
కాంతచేఁ బిలువనంపి కాచుకుండితి నిందాఁకా
అంతటా వెదకించితి నప్పు డెందువోతివి

(॥మంచి॥)
విరహాన నే నుండఁగా వెనకనే నిలుచుండి
యెరవులు చేసుకొనే వేమి చెప్పేది
సరుగ నీరాకలకు సగినాలు చూపించితి
అరుదుగా బత్తిసేసే వప్పు డెందువోతివి

(॥మంచి॥)
నవ్వెరగై నే నుండఁగా నీవె నన్నుఁగూడితివి
యెవ్వరుండుటా నెఱఁగ వేమి చెప్పేది
రవ్వగా శ్రీవేంకటేశ రతికి నిన్నే కోరితి
అవ్వలిమోమై నవ్వే వప్పు డెందువోతివి

(||pallavi||)
maṁchivānivalĕne māḍalāḍevu
aṁchĕla vachchidi viṭṭe ā(ā?)ppu ḍĕṁduvoyevu

(||maṁchi||)
siṁtado ne nuṁḍam̐gānu sĕvilo negadamāḍe-
vĕṁtaledu nīvalabu yemisĕppedi
kāṁtasem̐ biluvanaṁpi kāsuguṁḍidi niṁdām̐kā
aṁtaḍā vĕdagiṁchidi nappu ḍĕṁduvodivi

(||maṁchi||)
virahāna ne nuṁḍam̐gā vĕnagane nilusuṁḍi
yĕravulu sesugŏne vemi sĕppedi
saruga nīrāgalagu saginālu sūbiṁchidi
arudugā battisese vappu ḍĕṁduvodivi

(||maṁchi||)
navvĕragai ne nuṁḍam̐gā nīvĕ nannum̐gūḍidivi
yĕvvaruṁḍuḍā nĕṟam̐ga vemi sĕppedi
ravvagā śhrīveṁkaḍeśha radigi ninne koridi
avvalimomai navve vappu ḍĕṁduvodivi