మంచివానితో నింత మంకులేఁటికి
(॥పల్లవి॥)
మంచివానితో నింత మంకులేఁటికి
కంచము పొత్తు గలసి కైకొనఁగరాదా
(॥మంచి॥)
పట్టపుదేవులనంటా పాయపుదాననంటా
ఱట్టుగా దూరనేలే యాఱడి పతిని
గుట్టుతోడివాఁ డతఁడు గుణము కోటిసేసును
చుట్టరికమే నెరిపి సొంపు మీరరాదా
(॥మంచి॥)
ఆయ మెఱుఁగదునంటా అతఁడు బాసిచ్చెనంటా
చేయి వట్టి తియ్యనేలే చెలువునిని
దాయగాఁ డతఁడు మంచితనమే నిలువెల్లా
చాయసేసుకొని మోవి చవిచూపరాదా
(॥మంచి॥)
భావ మెఱుఁగుదునంటా పచ్చిగాఁ గూడితినంటా
కావరించనేలే శ్రీవేంకటేశ్వరుని
యీపల నన్నేలినాఁడు యీతనికి సరిలేరు
వాపులు గలయఁజెప్పి వద్ద నుండరాదా
(||pallavi||)
maṁchivānido niṁta maṁkulem̐ṭigi
kaṁchamu pŏttu galasi kaigŏnam̐garādā
(||maṁchi||)
paṭṭabudevulanaṁṭā pāyabudānanaṁṭā
ṟaṭṭugā dūranele yāṟaḍi padini
guṭṭudoḍivām̐ ḍadam̐ḍu guṇamu koḍisesunu
suṭṭarigame nĕribi sŏṁpu mīrarādā
(||maṁchi||)
āya mĕṟum̐gadunaṁṭā adam̐ḍu bāsichchĕnaṁṭā
seyi vaṭṭi tiyyanele sĕluvunini
dāyagām̐ ḍadam̐ḍu maṁchidaname niluvĕllā
sāyasesugŏni movi savisūbarādā
(||maṁchi||)
bhāva mĕṟum̐gudunaṁṭā pachchigām̐ gūḍidinaṁṭā
kāvariṁchanele śhrīveṁkaḍeśhvaruni
yībala nannelinām̐ḍu yīdanigi sarileru
vābulu galayam̐jĕppi vadda nuṁḍarādā