(॥పల్లవి॥)
మంచివాఁడవే నీవు మావాఁడవు
అంచెలనేల గుక్కేవాడవయ్య మాట
(॥॥)
ఆగడాలేలల సేసే వటువంటివాఁడవా
మీగుణా లైమైనాను మే మెఱఁగమా
నీగుఱు తెఱఁగలేక నిందలాడిరి చెలులు
యీగతి నేఁటికి వంచే వెత్తవయ్య శిరసు
(॥॥)
నేరములు నీకున్నవా నీయందు నేమి గడమ
గారనవునీచేఁతలు కన్న వే కావా
దూరిరింతే నిన్నిందరు తుదమొద లెఱఁగక
నారుకొన్న చింత యేల నవ్వవయ్య సెలవి
(॥॥)
బొంకనేరుతువా నీవు పొందుగా మమ్మేలితివి
కొంకేల శ్రీవేంకటేశ కొస రున్నదా
సంకించక నిన్ను నిట్టె సాదించిరింతేకాక
బింకపుగుట్టేమిటికి పెట్టువయ్య సేస
(||pallavi||)
maṁchivām̐ḍave nīvu māvām̐ḍavu
aṁchĕlanela gukkevāḍavayya māḍa
(||||)
āgaḍālelala sese vaḍuvaṁṭivām̐ḍavā
mīguṇā laimainānu me mĕṟam̐gamā
nīguṟu tĕṟam̐galega niṁdalāḍiri sĕlulu
yīgadi nem̐ṭigi vaṁche vĕttavayya śhirasu
(||||)
neramulu nīgunnavā nīyaṁdu nemi gaḍama
gāranavunīsem̐talu kanna ve kāvā
dūririṁte ninniṁdaru tudamŏda lĕṟam̐gaga
nārugŏnna siṁta yela navvavayya sĕlavi
(||||)
bŏṁkaneruduvā nīvu pŏṁdugā mammelidivi
kŏṁkela śhrīveṁkaḍeśha kŏsa runnadā
saṁkiṁchaga ninnu niṭṭĕ sādiṁchiriṁtegāga
biṁkabuguṭṭemiḍigi pĕṭṭuvayya sesa