మంచివాఁడవయ్య నీవు మమ్మేల రట్టు సేసేవు
(॥పల్లవి॥)
మంచివాఁడవయ్య నీవు మమ్మేల రట్టు సేసేవు
ముంచి నీకు మొక్కేము మన్నించవయ్యా యిపుడు
(॥మంచి॥)
పలికినట్టే నీతోఁ బలుమనేవు నన్ను
మెలుఁత కింతేసి మందెమేళమేఁటి
బలిమితో వసంతము పైఁజల్లుమని యాడేవు
వలపులు గనమైతే వరుసదప్పుదురా
(॥మంచి॥)
సరికి బేసికి నీతో సారెఁ బెనఁగు మనేవు
తరుణిని నాకింత వుద్దండాలేఁటికి
పరగ జూఁజాలాడి పందము గొనమనేవు
మురిపెము గనమైతే మొకళము లెంతురా
(॥మంచి॥)
మెట్టినట్టి నీపాదము మొట్టుమనేవు నన్నిటు
పట్టపురాణి నాకింత పంతమేఁటికి
యిట్టె శ్రీవేంకటేశ యెనసితివి రతుల
చుట్టరికము గలితే సొంట్లు సోదింతురా
(||pallavi||)
maṁchivām̐ḍavayya nīvu mammela raṭṭu sesevu
muṁchi nīgu mŏkkemu manniṁchavayyā yibuḍu
(||maṁchi||)
paliginaṭṭe nīdom̐ balumanevu nannu
mĕlum̐ta kiṁtesi maṁdĕmeḽamem̐ṭi
balimido vasaṁtamu paim̐jallumani yāḍevu
valabulu ganamaide varusadappudurā
(||maṁchi||)
sarigi besigi nīdo sārĕm̐ bĕnam̐gu manevu
taruṇini nāgiṁta vuddaṁḍālem̐ṭigi
paraga jūm̐jālāḍi paṁdamu gŏnamanevu
muribĕmu ganamaide mŏgaḽamu lĕṁturā
(||maṁchi||)
mĕṭṭinaṭṭi nībādamu mŏṭṭumanevu nanniḍu
paṭṭaburāṇi nāgiṁta paṁtamem̐ṭigi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidivi radula
suṭṭarigamu galide sŏṁṭlu sodiṁturā