Mamchidanamuvaarigi maarugonanemidigi

మంచితనమువారికి మారుకొననేమిటికి
Language

(॥పల్లవి॥)
మంచితనమువారికి మారుకొననేమిటికి
మించిన వేడుకతోనే మెరయవలెఁ గాక

(॥మంచి॥)
సారెకు మాంటాడనేల చలము సాదించనేల
కేరడము లాడనేల కెలయనేల
వూరకె కొసరనేల వొడ్డించుకొననేల
చేరి సతి కిచ్చకమే సేయఁగరాదా

(॥మంచి॥)
బలిమి చూపఁగనేల పంతములాడఁగనేల
సొలయనేల మనసు సోదించనేల
మలసి దూరఁగనేల మర్మము లెత్తఁగనేల
చెలువుని కింపుగొనే చెనకరాదా

(॥మంచి॥)
వెంగెము లాడఁగనేల వేఁడుకోనప్పటినేల
ముంగురులంటఁగనేల మొక్కఁగనేల
సంగడి శ్రీవేంకటేశు సతి వలమేల్మంగవు
సంగతిగాఁ గూడితివి సరసమాడరాదా

(||pallavi||)
maṁchidanamuvārigi mārugŏnanemiḍigi
miṁchina veḍugadone mĕrayavalĕm̐ gāga

(||maṁchi||)
sārĕgu māṁṭāḍanela salamu sādiṁchanela
keraḍamu lāḍanela kĕlayanela
vūragĕ kŏsaranela vŏḍḍiṁchugŏnanela
seri sadi kichchagame seyam̐garādā

(||maṁchi||)
balimi sūbam̐ganela paṁtamulāḍam̐ganela
sŏlayanela manasu sodiṁchanela
malasi dūram̐ganela marmamu lĕttam̐ganela
sĕluvuni kiṁpugŏne sĕnagarādā

(||maṁchi||)
vĕṁgĕmu lāḍam̐ganela vem̐ḍugonappaḍinela
muṁgurulaṁṭam̐ganela mŏkkam̐ganela
saṁgaḍi śhrīveṁkaḍeśhu sadi valamelmaṁgavu
saṁgadigām̐ gūḍidivi sarasamāḍarādā