Mamchidanamu seside maagainaam garamgunu

మంచితనము సేసితే మాకైనాఁ గరఁగును
Language

(॥పల్లవి॥)
మంచితనము సేసితే మాకైనాఁ గరఁగును
కొంచించ కాతనిఁ బైకొనవే చెలియా

(॥మంచి॥)
వేడుకకాఁ డాతఁడు వెంగెమాడనేమిటికే
కూడివడి చాయసేసుకొనుటగాక
వాడినమోవి చూచి వట్టినవ్వు నవ్వనేలే
వీడెమిచ్చి రతులకు వేఁడుకొంటగాక

(॥మంచి॥)
అసొదాకాఁ డాతఁడు అవుఁగాదననేఁటికె
సేసపట్టి తగఁ బొందుసేసుటగాక
సేసినచేఁత లెంచి సిగ్గువరుచనేఁటికే
యేసుద్దులకైనా నిచ్చగించుటగాక

(॥మంచి॥)
శ్రీవేంకటేశు డాతఁడు చెప్పిచూపనేఁటికే
సేవసేసె తని మెచ్చఁజేయుటగాక
నీవలమేలుమంగవు నెపాలు వెదకనేలే
దేవులవై వురమునఁ దిరముకొందుగాక

(||pallavi||)
maṁchidanamu seside māgainām̐ garam̐gunu
kŏṁchiṁcha kādanim̐ baigŏnave sĕliyā

(||maṁchi||)
veḍugagām̐ ḍādam̐ḍu vĕṁgĕmāḍanemiḍige
kūḍivaḍi sāyasesugŏnuḍagāga
vāḍinamovi sūsi vaṭṭinavvu navvanele
vīḍĕmichchi radulagu vem̐ḍugŏṁṭagāga

(||maṁchi||)
asŏdāgām̐ ḍādam̐ḍu avum̐gādananem̐ṭigĕ
sesabaṭṭi tagam̐ bŏṁdusesuḍagāga
sesinasem̐ta lĕṁchi sigguvarusanem̐ṭige
yesuddulagainā nichchagiṁchuḍagāga

(||maṁchi||)
śhrīveṁkaḍeśhu ḍādam̐ḍu sĕppisūbanem̐ṭige
sevasesĕ tani mĕchcham̐jeyuḍagāga
nīvalamelumaṁgavu nĕbālu vĕdaganele
devulavai vuramunam̐ diramugŏṁdugāga