మంచితనమే మేలు మగవాని తోడుతను
(॥పల్లవి॥)
మంచితనమే మేలు మగవాని తోడుతను
మించి చెక్కునొక్కఁగానే మేర మీర నేలే
(॥మంచి॥)
చిక్కని వెన్నెలతేట సెలవుల నుండఁగానే
చక్కఁగా విభునినేల జంకించేవే
మక్కువలు నిండుకొని మనసులో నుండఁగానే
చొక్కపు కనుఁగొనలు సొలయఁగ నేలే
(॥మంచి॥)
పెనగొన్న మంచిమాట పెదవిపై నుండఁగానే
కొనగోరఁ జిమ్మేటి గుంపెన లేలే
నినుపులై మొగమోట నిలువున నుండఁగానే
ననుపుల సిగ్గులు నానఁబెట్ట నేలే
(॥మంచి॥)
కడలేని యాసలు కాఁగిటిలో నుండఁగానే
చిడుముడితో జోలిసేయఁగ నేలే
యెడయక శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నేలె
విడెము నీకియ్యఁగానే వేగిరించ నేలే
(||pallavi||)
maṁchidaname melu magavāni toḍudanu
miṁchi sĕkkunŏkkam̐gāne mera mīra nele
(||maṁchi||)
sikkani vĕnnĕladeḍa sĕlavula nuṁḍam̐gāne
sakkam̐gā vibhuninela jaṁkiṁcheve
makkuvalu niṁḍugŏni manasulo nuṁḍam̐gāne
sŏkkabu kanum̐gŏnalu sŏlayam̐ga nele
(||maṁchi||)
pĕnagŏnna maṁchimāḍa pĕdavibai nuṁḍam̐gāne
kŏnagoram̐ jimmeḍi guṁpĕna lele
ninubulai mŏgamoḍa niluvuna nuṁḍam̐gāne
nanubula siggulu nānam̐bĕṭṭa nele
(||maṁchi||)
kaḍaleni yāsalu kām̐giḍilo nuṁḍam̐gāne
siḍumuḍido joliseyam̐ga nele
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninnelĕ
viḍĕmu nīgiyyam̐gāne vegiriṁcha nele