మంచిదాయ దానికేమి మాటలు పోట్లయ్యీనా
(॥పల్లవి॥)
మంచిదాయ దానికేమి మాటలు పోట్లయ్యీనా
పెంచి యెంతసేసినా నీపెద్దరిక మింతే కా
(॥మంచి॥)
మెల్లనే నే మాటాడితే మించి ఇందరితోడాను
తెల్లమిగా నాడేవు తిట్టితినంటా
బల్లిదుఁడ వౌదువయ్య పని ఇందే కానవచ్చె
కల్లలాడేవా నీవు కలుగఁగఁబోలును
(॥మంచి॥)
పూవులచెం డిచ్చితేను పూఁచి ఇందరితోడాను
వేవేలుగాఁ జెప్పేవు వేసితినంటా
దేవరవుగావా నీవు తెలిసె నిన్నియు మాకు
నీవల్ల నేరమున్నదా నిజము గాఁబోలును
(॥మంచి॥)
పాదాలు సేవసేసితే పై పై నిందరితోడాను
గోదానఁ జెప్పేవు బెట్టి గుద్దితినంటా
యీదెస శ్రీవేంకటేశ యెనసితి విఁక మీర
సాదవుగావా ఇవే చవులు గాఁబోలును
(||pallavi||)
maṁchidāya dānigemi māḍalu poṭlayyīnā
pĕṁchi yĕṁtasesinā nībĕddariga miṁte kā
(||maṁchi||)
mĕllane ne māḍāḍide miṁchi iṁdaridoḍānu
tĕllamigā nāḍevu tiṭṭidinaṁṭā
ballidum̐ḍa vauduvayya pani iṁde kānavachchĕ
kallalāḍevā nīvu kalugam̐gam̐bolunu
(||maṁchi||)
pūvulasĕṁ ḍichchidenu pūm̐si iṁdaridoḍānu
vevelugām̐ jĕppevu vesidinaṁṭā
devaravugāvā nīvu tĕlisĕ ninniyu māgu
nīvalla neramunnadā nijamu gām̐bolunu
(||maṁchi||)
pādālu sevaseside pai pai niṁdaridoḍānu
godānam̐ jĕppevu bĕṭṭi guddidinaṁṭā
yīdĕsa śhrīveṁkaḍeśha yĕnasidi vim̐ka mīra
sādavugāvā ive savulu gām̐bolunu