Malle pamdiri needalona jaabilli

మల్లె పందిరి నీడలోన జాబిల్లి
Year
Language

పల్లవి:

మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి..

చరణం 1:

గడుసు పిల్లకు వయసు నేడే.. గురుతుకొచ్చిందీ..ఈ..
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ..

గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..ఈ..
మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ..

ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి
ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి

కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవార నీయకోయి ఈ రేయి..

చరణం 2:

పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..

పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..
పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..

ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను
ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి

మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి..

ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ..
ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ...

pallavi:

mallĕ paṁdiri nīḍalona jābilli.. maṁchamesi uṁchinānu jābilli
mallĕ paṁdiri nīḍalona jābilli.. maṁchamesi uṁchinānu jābilli
mā annagu.. mā saṁdrigi.. idi tŏli reyi.. nāgidi varamoyi..ī..
kaḽḽuguṭṭi vĕḽḽagoyi jābilli.. tĕllavāranīyagoyi ī reyi..

saraṇaṁ 1:

gaḍusu pillagu vayasu neḍe.. gurudugŏchchiṁdī..ī..
mŏraḍuvāni manasu dānigi pulagariṁchiṁdī..ī..

gaḍusubillagu vayasu neḍe gurudugŏchchiṁdī..ī..
mŏraḍuvāni manasu dānigi pulagariṁchiṁdī..ī..

iddarigī īnāḍu nuvve muddu nerbāli
ā muddu sūsi sukkale ninu vĕkkiriṁchāli

kaḽḽu kuṭṭi vĕḽḽagoyi jābilli.. tĕllavāra nīyagoyi ī reyi..

saraṇaṁ 2:

pĕḽḽi saṁbaramĕnnaḍĕrugani illu nādī..ī..
pasubudāḍe nosugoni bradugu nādī..ī..

pĕḽli saṁbaramĕnnaḍĕrugani illu nādī..ī..
pasubu tāḍe nosugoni bradugu nādī..ī..

ī pĕḽḽi sūsi nenu kūḍā muttaiduvainānu
ī puṇṇĕme pai janmalo nanu illālini seyāli

mallĕ paṁdiri nīḍalona jābilli.. maṁchamesi uṁchinānu jābilli
mā annagu.. mā saṁdrigi.. idi tŏli reyi.. nāgidi varamoyi..ī..
kaḽḽuguṭṭi vĕḽḽagoyi jābilli.. tĕllavāranīyagoyi ī reyi..

ūhū.. ūhū.. ūhū.. ūhū..
ūhū.. ūhū.. ūhū.. ūhū...