Maguvalam jegonaga maanavachchunaa

మగువలఁ జేకొనక మానవచ్చునా
Language

(॥పల్లవి॥)
మగువలఁ జేకొనక మానవచ్చునా
నిగిడి సరసముల నేరుపరి యితఁడు

(॥మగు॥)
దప్పిదేరీ మోవినంటా తప్పులెంచనేఁటికే
కొప్పు జారెనంటాఁ బతిఁ గొసరనేలే
రెప్పలు దేలించెనంటా రేసులు చూపకువే
యెప్పుడుఁ బదారువేల నేలినవాఁడతఁడు

(॥మగు॥)
వాడె నలమోమనుచు వక్కణ లడుగకువే
తోడఁ జెమరించెనంటా దూరకువే
వేడుకకాఁడనుచు వెంగెము లాడకువే
మేడెపు గొల్లెతలకు మేఁటి మగఁడతఁడు

(॥మగు॥)
నిట్టూర్పు లేడవని నేరము లెంచకువే
వొట్టీఁ బులకలనుచు నొరయకువే
పట్టపు దేవుళ్లను బహుసతీజనులను
వెట్టలేక కూడేటి శ్రీవేంకటేశుఁ డతఁడు

(||pallavi||)
maguvalam̐ jegŏnaga mānavachchunā
nigiḍi sarasamula nerubari yidam̐ḍu

(||magu||)
dappiderī movinaṁṭā tappulĕṁchanem̐ṭige
kŏppu jārĕnaṁṭām̐ badim̐ gŏsaranele
rĕppalu deliṁchĕnaṁṭā resulu sūbaguve
yĕppuḍum̐ badāruvela nelinavām̐ḍadam̐ḍu

(||magu||)
vāḍĕ nalamomanusu vakkaṇa laḍugaguve
toḍam̐ jĕmariṁchĕnaṁṭā dūraguve
veḍugagām̐ḍanusu vĕṁgĕmu lāḍaguve
meḍĕbu gŏllĕdalagu mem̐ṭi magam̐ḍadam̐ḍu

(||magu||)
niṭṭūrbu leḍavani neramu lĕṁchaguve
vŏṭṭīm̐ bulagalanusu nŏrayaguve
paṭṭabu devuḽlanu bahusadījanulanu
vĕṭṭalega kūḍeḍi śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu