Maguvalagu balimi mamchidaname

మగువలకు బలిమి మంచితనమె
Language

(॥పల్లవి॥)
మగువలకు బలిమి మంచితనమె
చిగురు నవ్వులతోడఁ జిత్తగించి వినవే

(॥మగు॥)
చన వెంత గలిగినా సంగాతము లమరును
మనవి యొనగూడితే మచ్చిక రేఁగు
వినయము సతమైతే వేడుక లగ్గలమౌను
యెనసి నీ రమణుని యిచ్చనే మెలఁగవే

(॥మగు॥)
సరసము లితవైతే సంతోసములు మించు
వొరిమ గలిగితేను వుబ్బు మనసు
సరవితోటి వలపు చవులెల్లాఁ బుట్టించు
సిరుల నీపతికిని సేవలెల్లాఁ జేయవే

(॥మగు॥)
వావుల దొరసితేను వాడికలు తానే వచ్చు
కైవసమై యుండితేనే ఘనమౌఁ దమి
చేవదేర నిన్నుఁ గూడె శ్రీవేంకటేశ్వరుఁడు
యీవల నీమగఁ డీతఁ డెన్నఁడూ బాయకులే

(||pallavi||)
maguvalagu balimi maṁchidanamĕ
siguru navvuladoḍam̐ jittagiṁchi vinave

(||magu||)
sana vĕṁta galiginā saṁgādamu lamarunu
manavi yŏnagūḍide machchiga rem̐gu
vinayamu sadamaide veḍuga laggalamaunu
yĕnasi nī ramaṇuni yichchane mĕlam̐gave

(||magu||)
sarasamu lidavaide saṁtosamulu miṁchu
vŏrima galigidenu vubbu manasu
saravidoḍi valabu savulĕllām̐ buṭṭiṁchu
sirula nībadigini sevalĕllām̐ jeyave

(||magu||)
vāvula dŏrasidenu vāḍigalu tāne vachchu
kaivasamai yuṁḍidene ghanamaum̐ dami
sevadera ninnum̐ gūḍĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
yīvala nīmagam̐ ḍīdam̐ ḍĕnnam̐ḍū bāyagule