మగువకుఁ జనవిచ్చి మన్నింతువు గాక ఇఁక
(॥పల్లవి॥)
మగువకుఁ జనవిచ్చి మన్నింతువు గాక ఇఁక
మగిడి మగిడి యేమి మమ్మడిగేవయ్యా
(॥మగు॥)
యెలుత గుబ్బలు నీకు మీఁదెత్తుకవున్నది
పలచనిమోవి జన్నె వట్టుకున్నది
పలుకుఁదేనెలు నీకుపారము సేసుకున్నది
యెలమి నింకా సుద్దులు యేమడిగేవయ్యా
(॥మగు॥)
వుమ్మగిలి సింగారాలు వుడుపావట్టుకున్నది
తమ్మిమోము సూడిదెగా దాఁచుకున్నది
కమ్మిన మొక్కలు చేతఁ గానుకవట్టుకున్నది
ఇమ్ముల నింకా సుద్దులు యేమడిగేవయ్యా
(॥మగు॥)
నెట్టుకొన్న జవ్వనము నీసొమ్ము సేసుకున్నది
గుట్టున వలపు వొడిఁగట్టుకున్నది
నెట్టన శ్రీవేంకటేశ నీవె యీకెఁ గూడితివి
ఇట్టె యింకా సుద్దులు యేమడిగేవయ్యా
(||pallavi||)
maguvagum̐ janavichchi manniṁtuvu gāga im̐ka
magiḍi magiḍi yemi mammaḍigevayyā
(||magu||)
yĕluda gubbalu nīgu mīm̐dĕttugavunnadi
palasanimovi jannĕ vaṭṭugunnadi
palugum̐denĕlu nīgubāramu sesugunnadi
yĕlami niṁkā suddulu yemaḍigevayyā
(||magu||)
vummagili siṁgārālu vuḍubāvaṭṭugunnadi
tammimomu sūḍidĕgā dām̐sugunnadi
kammina mŏkkalu sedam̐ gānugavaṭṭugunnadi
immula niṁkā suddulu yemaḍigevayyā
(||magu||)
nĕṭṭugŏnna javvanamu nīsŏmmu sesugunnadi
guṭṭuna valabu vŏḍim̐gaṭṭugunnadi
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvĕ yīgĕm̐ gūḍidivi
iṭṭĕ yiṁkā suddulu yemaḍigevayyā