Maguvagu lomganela magavaamdavu

మగువకు లోఁగనేల మగవాఁడవు
Language

(॥పల్లవి॥)
మగువకు లోఁగనేల మగవాఁడవు
నిగిడి బుద్దులుచెప్పి నిలిపే నే నాపెను

(॥మగు॥)
బత్తి నేఁ జేయఁగా నీవు పరాకున నున్నాఁడవు
చిత్తములో తలపోఁత చెప్పరాదా
యెత్తల నెవ్వతైనా నిన్నేమైనా నాడినాను
వుత్తరువు చెప్పే నేను వొద్దు నీకు వెరపు

(॥మగు॥)
ఆకుమడిచియ్యఁగాను అవ్వలి మోమైనాఁడవు
దీకొని చూచేచూపు తిప్పుకోరాదా
నీకాంత లెవ్వరైనా నిన్ను నేరాలెంచితేను
నీకు నడ్డమయ్యేఁగాని నిమ్మలాన నుండుము

(॥మగు॥)
చెయ్యెత్తి మొక్కఁగాను సిగ్గుతో నున్నాఁడవు
తియ్యనినోరను నన్ను దీవించరాదా
వొయ్యనే శ్రీవేంకటేశ వొద్దకై నన్నేలితివి
చయ్యాటాలు మాన్పేఁగాని సతిఁ జూపునాకు

(||pallavi||)
maguvagu lom̐ganela magavām̐ḍavu
nigiḍi buddulusĕppi nilibe ne nābĕnu

(||magu||)
batti nem̐ jeyam̐gā nīvu parāguna nunnām̐ḍavu
sittamulo talabom̐ta sĕpparādā
yĕttala nĕvvadainā ninnemainā nāḍinānu
vuttaruvu sĕppe nenu vŏddu nīgu vĕrabu

(||magu||)
āgumaḍisiyyam̐gānu avvali momainām̐ḍavu
dīgŏni sūsesūbu tippugorādā
nīgāṁta lĕvvarainā ninnu nerālĕṁchidenu
nīgu naḍḍamayyem̐gāni nimmalāna nuṁḍumu

(||magu||)
sĕyyĕtti mŏkkam̐gānu siggudo nunnām̐ḍavu
tiyyaninoranu nannu dīviṁcharādā
vŏyyane śhrīveṁkaḍeśha vŏddagai nannelidivi
sayyāḍālu mānpem̐gāni sadim̐ jūbunāgu