మగువ నేరుతువే మాఁటలు । నీవు
(॥పల్లవి॥)
మగువ నేరుతువే మాఁటలు । నీవు
తగిలి తెలుసుకో తారుకాణలు
(॥మగు॥)
చెనకేనే వో చెలియా - నీ
చెనకులే కావా చెక్కులవి
పెనఁగకు చనుఁగవ పిసికేనే యవి
గనములు చేతికిఁ గడు గట్టులురా
(॥మగు॥)
నవ్వేనే వో నలిలాక్ష - నీ
నవ్వులు నిజమైనవి నేఁడు
జవ్వాది మేనఁ జమరేనే
వువ్విళ్ళయ వలపూరిఁ గదరా
(॥మగు॥)
తలఁపించేనే తమకములు - ఆవి
తలఁచకతొల్లే తలకెక్కె
యెలమిని శ్రీవేంకటేశుఁడనే - నే -
నలమేల్మంగను ఆలనే కదరా
(||pallavi||)
maguva neruduve mām̐ṭalu | nīvu
tagili tĕlusugo tārugāṇalu
(||magu||)
sĕnagene vo sĕliyā - nī
sĕnagule kāvā sĕkkulavi
pĕnam̐gagu sanum̐gava pisigene yavi
ganamulu sedigim̐ gaḍu gaṭṭulurā
(||magu||)
navvene vo nalilākṣha - nī
navvulu nijamainavi nem̐ḍu
javvādi menam̐ jamarene
vuvviḽḽaya valabūrim̐ gadarā
(||magu||)
talam̐piṁchene tamagamulu - āvi
talam̐sagadŏlle talagĕkkĕ
yĕlamini śhrīveṁkaḍeśhum̐ḍane - ne -
nalamelmaṁganu ālane kadarā