మగవాని కేఁటి యెగ్గు మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మగవాని కేఁటి యెగ్గు మాపు దాఁకాను
తగిలి భోగించినదే దక్కినది గాక
(॥మగ॥)
మునుకొని యాపెగుణములు నాతోఁ బొగడేవు
వనతఁ దెచ్చుకొనఁగా వలదనేనా
మనసొకతెఁ గోరఁగా మాటలు నాతోనాడఁగా
యెనసినట్టయ్యీనా యేఁకరేది దోసము
(॥మగ॥)
వెలి నాపె నీకిచ్చినవిడెము నాకిచ్చేవు
వలపెంతగలిగినా వలదనేనా
చెలిమి నీ కందుండఁగా చేయి నాపైఁ జాఁచఁగాను
ఫలమేవంక వచ్చునో పచ్చారేది దోసము
(॥మగ॥)
జోడుగా నాపెఁగలసి చుట్టరికాలు చెప్పేవు
వాడికె సేసుకొనఁగా వలదనేనా
ఆడ నాపె రాఁగా నన్నుఁ గూడితి శ్రీవేంకటేశ
వేడుక నట్టె మొకము వేలించేది దోసము
(||pallavi||)
magavāni kem̐ṭi yĕggu mābu dām̐kānu
tagili bhogiṁchinade dakkinadi gāga
(||maga||)
munugŏni yābĕguṇamulu nādom̐ bŏgaḍevu
vanadam̐ dĕchchugŏnam̐gā valadanenā
manasŏgadĕm̐ goram̐gā māḍalu nādonāḍam̐gā
yĕnasinaṭṭayyīnā yem̐karedi dosamu
(||maga||)
vĕli nābĕ nīgichchinaviḍĕmu nāgichchevu
valabĕṁtagaliginā valadanenā
sĕlimi nī kaṁduṁḍam̐gā seyi nābaim̐ jām̐sam̐gānu
phalamevaṁka vachchuno pachchāredi dosamu
(||maga||)
joḍugā nābĕm̐galasi suṭṭarigālu sĕppevu
vāḍigĕ sesugŏnam̐gā valadanenā
āḍa nābĕ rām̐gā nannum̐ gūḍidi śhrīveṁkaḍeśha
veḍuga naṭṭĕ mŏgamu veliṁchedi dosamu