Magavaani kalugela maguvalado

మగవాని కలుకేల మగువలతో
Language

(॥పల్లవి॥)
మగవాని కలుకేల మగువలతో
చిగిరించె వలపులు చింతలేఁటికయ్యా

(॥మగ॥)
దొంతరమాఁటలాడేది దొరకొని దూరేది
కాంతలము మా కెపుడు కలసాజమే
యెంత కెంతనుచు నీవు యెగ్గులువట్టేవు నేఁడు
వింతదానఁగాను నాకు విడె మియ్యవయ్యా

(॥మగ॥)
తేరకొనఁ జూచేది తిట్లూరకే తిట్టేది
కోరి వచ్చి పైకొన్న మాగుణము లివి
యేరేతి వాఁడవునీవు యెన్నటి కెన్నటిసుద్ది
ఆరయ నీకు మొక్కే నండకు రావయ్యా

(॥మగ॥)
కందువకుఁ దీసేది కాఁకలెల్లాఁ జల్లేది
అందిపొందేమారతిఅంగము లివి
యిందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
ముందుముందే నాకు మోవి యియ్యవయ్యా

(||pallavi||)
magavāni kalugela maguvalado
sigiriṁchĕ valabulu siṁtalem̐ṭigayyā

(||maga||)
dŏṁtaramām̐ṭalāḍedi dŏragŏni dūredi
kāṁtalamu mā kĕbuḍu kalasājame
yĕṁta kĕṁtanusu nīvu yĕgguluvaṭṭevu nem̐ḍu
viṁtadānam̐gānu nāgu viḍĕ miyyavayyā

(||maga||)
teragŏnam̐ jūsedi tiṭlūrage tiṭṭedi
kori vachchi paigŏnna māguṇamu livi
yeredi vām̐ḍavunīvu yĕnnaḍi kĕnnaḍisuddi
āraya nīgu mŏkke naṁḍagu rāvayyā

(||maga||)
kaṁduvagum̐ dīsedi kām̐kalĕllām̐ jalledi
aṁdibŏṁdemāradiaṁgamu livi
yiṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
muṁdumuṁde nāgu movi yiyyavayyā