మగవాఁడు తనకే యమరుఁగా కేమి సేసినా
(॥పల్లవి॥)
మగవాఁడు తనకే యమరుఁగా కేమి సేసినా
యెగసక్కెములు గావా యింతుల కీపనులు
(॥మగ॥)
చిగురాకుమోవి యేల చిల్లులు సేయవచ్చీనే
నగుమంటా నూరకే లానలు వెట్టినే
మొగమెత్తిచూడుమంటా మొనగోర నేలె త్తీనే
జిగిమించ సిగ్గుగాదా చెలుల కీపనులు
(॥మగ॥)
బంగారువంటిచన్నులు పట్టియేల పిసికీనే
వంగి మొక్కుమంటాఁ గావరించీనేలే
చెంగల గూచుండుమంటా చెఱఁగేల ముట్టినే
సంగతి నార్జముగాదా సతుల కీపనులు
(॥మగ॥)
అందపుఁ దీగెవంటిమే నందులకు బెనఁగీనేలే
పొంది కాఁగిటనే యెంత భోగించీనే
అందపు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను నేను
కందువ నవ్వులుగావా కాంతల కీపనులు
(||pallavi||)
magavām̐ḍu tanage yamarum̐gā kemi sesinā
yĕgasakkĕmulu gāvā yiṁtula kībanulu
(||maga||)
sigurāgumovi yela sillulu seyavachchīne
nagumaṁṭā nūrage lānalu vĕṭṭine
mŏgamĕttisūḍumaṁṭā mŏnagora nelĕ ttīne
jigimiṁcha siggugādā sĕlula kībanulu
(||maga||)
baṁgāruvaṁṭisannulu paṭṭiyela pisigīne
vaṁgi mŏkkumaṁṭām̐ gāvariṁchīnele
sĕṁgala gūsuṁḍumaṁṭā sĕṟam̐gela muṭṭine
saṁgadi nārjamugādā sadula kībanulu
(||maga||)
aṁdabum̐ dīgĕvaṁṭime naṁdulagu bĕnam̐gīnele
pŏṁdi kām̐giḍane yĕṁta bhogiṁchīne
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
kaṁduva navvulugāvā kāṁtala kībanulu