Magavaamdavu neevu maguvanu nenaide

మగవాఁడవు నీవు మగువను నేనైతే
Language

(॥పల్లవి॥)
మగవాఁడవు నీవు మగువను నేనైతే
వెగటున నిన్నుఁ గడు వెగ్గళించ వచ్చేమా

(॥మగ॥)
కంటకమాడఁగ లేదు కసరుకొనఁగ లేదు
నంటున నే నీతోను నవ్వరాదా
వొంటే నందుకుఁగా నీవు వూరకే సాదించేవు
బంట పంతాలకు నీతో పైకొనవచ్చేమా

(॥మగ॥)
కొలదిమీరఁగ లేదు కొంగువట్టి తియ్యలేదు
సొలసి నిన్నుఁ దప్పకచూడరాదా
చెలకత్తెలకు నీవు చెప్పిచూపే విదియెల్లా
చలమిబలుములను జింకించవచ్చేమా

(॥మగ॥)
జోలిఁ బెట్టలేదు నిన్ను సోదనగొనఁగలేదు
మేలుమేలనుచు నిన్ను మెచ్చరాదా
యేలితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
గేలిసేసి యిఁక నిన్నుఁ గెరలించవచ్చునా

(||pallavi||)
magavām̐ḍavu nīvu maguvanu nenaide
vĕgaḍuna ninnum̐ gaḍu vĕggaḽiṁcha vachchemā

(||maga||)
kaṁṭagamāḍam̐ga ledu kasarugŏnam̐ga ledu
naṁṭuna ne nīdonu navvarādā
vŏṁṭe naṁdugum̐gā nīvu vūrage sādiṁchevu
baṁṭa paṁtālagu nīdo paigŏnavachchemā

(||maga||)
kŏladimīram̐ga ledu kŏṁguvaṭṭi tiyyaledu
sŏlasi ninnum̐ dappagasūḍarādā
sĕlagattĕlagu nīvu sĕppisūbe vidiyĕllā
salamibalumulanu jiṁkiṁchavachchemā

(||maga||)
jolim̐ bĕṭṭaledu ninnu sodanagŏnam̐galedu
melumelanusu ninnu mĕchcharādā
yelidivi śhrīveṁkaḍeśha nannu niṁtalonĕ
gelisesi yim̐ka ninnum̐ gĕraliṁchavachchunā