మగవాఁడ విన్నిటాను మరిలేదు వెరపు
(॥పల్లవి॥)
మగవాఁడ విన్నిటాను మరిలేదు వెరపు
సొగిసి యేడఁ జూచినా చుట్టములే నీకు
(॥॥)
పలచనియెలుఁగునఁ బాడీ నెవ్వతో కాని
కెలన నుండి ఆలకించేవు నీవు
పిలిపించుకొనరాదా ప్రియమైతే నీకడకు
మలసి యీడానాడ మఱఁగేల నీకు
(॥॥)
పొరుగిరుగుల నుండి పొలసీ నెవ్వతోకాని
సొరిది నీమేడలెక్కి చూచేవు నీవు
అరసి మాఁటాడరాదా ఆస నీకుఁ గలితేను
సిరులనవ్వుల వట్టిసిగ్గులేల నీకు
(॥॥)
యిదివో సన్నలు సేసీ నింటిలో నెవ్వతొకాని
కదియ నూఁకించేవు కంమ్మటి నీవు
అదన శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
వదలక కూడితివి వంతులేల నీకు
(||pallavi||)
magavām̐ḍa vinniḍānu mariledu vĕrabu
sŏgisi yeḍam̐ jūsinā suṭṭamule nīgu
(||||)
palasaniyĕlum̐gunam̐ bāḍī nĕvvado kāni
kĕlana nuṁḍi ālagiṁchevu nīvu
pilibiṁchugŏnarādā priyamaide nīgaḍagu
malasi yīḍānāḍa maṟam̐gela nīgu
(||||)
pŏrugirugula nuṁḍi pŏlasī nĕvvadogāni
sŏridi nīmeḍalĕkki sūsevu nīvu
arasi mām̐ṭāḍarādā āsa nīgum̐ galidenu
sirulanavvula vaṭṭisiggulela nīgu
(||||)
yidivo sannalu sesī niṁṭilo nĕvvadŏgāni
kadiya nūm̐kiṁchevu kaṁmmaḍi nīvu
adana śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
vadalaga kūḍidivi vaṁtulela nīgu