మగనికి నాలికిని మర్మము లివి
(॥పల్లవి॥)
మగనికి నాలికిని మర్మము లివి
తగిలి పాయకుండితే తమకము రేఁగును
(॥మగ॥)
పచ్చిమాఁట లాడితేనే భావములు గరఁగును
యిచ్చకము సేసితేనే యింపు వుట్టును
కొచ్చి కొచ్చి కొసరితే గురుతౌఁ జుట్టరికము
వచ్చినట్టే వచ్చితేను వాడికలు గలుగు
(॥మగ॥)
వినయము చూపితేనే వెగ్గళించు మోహము
మనసు లెనసితేనే మన్నన లెక్కు
తనువులు సోఁకితేనే తడఁబడుఁ గోరికలు
ననిచి పైకొంటేనే నవ్వులెల్లా వచ్చును
(॥మగ॥)
కలుపుకోలు గలితే కాఁపురము లొనరును
తలఁపు సరిదాఁకితే తగులుఁ గాంక్ష
యెలమి శ్రీ వేంకటేశ యింతి నేలితివి నీవు
చలివాయఁ గూడితేనే చవులౌను రతులు
(||pallavi||)
maganigi nāligini marmamu livi
tagili pāyaguṁḍide tamagamu rem̐gunu
(||maga||)
pachchimām̐ṭa lāḍidene bhāvamulu garam̐gunu
yichchagamu sesidene yiṁpu vuṭṭunu
kŏchchi kŏchchi kŏsaride gurudaum̐ juṭṭarigamu
vachchinaṭṭe vachchidenu vāḍigalu galugu
(||maga||)
vinayamu sūbidene vĕggaḽiṁchu mohamu
manasu lĕnasidene mannana lĕkku
tanuvulu som̐kidene taḍam̐baḍum̐ gorigalu
nanisi paigŏṁṭene navvulĕllā vachchunu
(||maga||)
kalubugolu galide kām̐puramu lŏnarunu
talam̐pu saridām̐kide tagulum̐ gāṁkṣha
yĕlami śhrī veṁkaḍeśha yiṁti nelidivi nīvu
salivāyam̐ gūḍidene savulaunu radulu