Maganido nemidige mamdemelaalu

మగనితో నేమిటికే మందెమేళాలు
Language

(॥పల్లవి॥)
మగనితో నేమిటికే మందెమేళాలు
నగుతా నుండితేనే ననుపౌఁగాక

(॥మగ॥)
చనుఁగవ నొరసేవు సంగడిఁ గూచుండుకొంటా
మొనగోరు మోపేవు మొక్కేనంటాను
పెనఁగులాడ వచ్చేవు ప్రియములు చెప్పుతానే
యెనలేని నీ బిరుదు లేల చూపేనే

(॥మగ॥)
తమలము చిందేవు తగిలి మాఁటాడుతానే
చెమటలు చిమ్మేవు చెనకుతానే
తమకము రేఁచేవు తగఁ బాదాలొత్తుతావే
అమరునే నీ చేఁతలు అన్నియును గంటిమి

(॥మగ॥)
యెంగిలి సేసేవు మోవి యేకతము లాడుతానే
కొంగువట్టే వప్పటిని కొసరుతానే
అంగవించి శ్రీవేంకటాధిపుడు నిన్నుఁ గూడె
కంగులేని నీ వలపు కానవచ్చె నిపుడు

(||pallavi||)
maganido nemiḍige maṁdĕmeḽālu
nagudā nuṁḍidene nanubaum̐gāga

(||maga||)
sanum̐gava nŏrasevu saṁgaḍim̐ gūsuṁḍugŏṁṭā
mŏnagoru mobevu mŏkkenaṁṭānu
pĕnam̐gulāḍa vachchevu priyamulu sĕppudāne
yĕnaleni nī birudu lela sūbene

(||maga||)
tamalamu siṁdevu tagili mām̐ṭāḍudāne
sĕmaḍalu simmevu sĕnagudāne
tamagamu rem̐sevu tagam̐ bādālŏttudāve
amarune nī sem̐talu anniyunu gaṁṭimi

(||maga||)
yĕṁgili sesevu movi yegadamu lāḍudāne
kŏṁguvaṭṭe vappaḍini kŏsarudāne
aṁgaviṁchi śhrīveṁkaḍādhibuḍu ninnum̐ gūḍĕ
kaṁguleni nī valabu kānavachchĕ nibuḍu