Magam demee nanamdamtaa malasevu kelasevu

మగఁ డేమీ ననఁడంటా మలసేవు కెలసేవు
Language

(॥పల్లవి॥)
మగఁ డేమీ ననఁడంటా మలసేవు కెలసేవు
యెగసక్కేలాడేవారి నెంచుకోవుగదవే

(॥మగఁ॥)
పంతములు మెరసేవు పకపకనవ్వేవు
మంతనాన రమణుఁడు మన్నించెనంటా
చెంతనున్న వారిలోను సిగ్గవడ వించుకంతా
యెంతలేదు నీపగటు యెమ్మెలాఁడివటవే

(॥మగఁ॥)
సారెసారె మాటాడేవు సన్నలు మోవిఁజేసేవు
చేరి నీచన నాతఁడు చెల్లించెనంటా
యీరీతి నిల్లాండ్లకు వింతరట్టు గలదా
నేరపులెల్లాఁజూపేవు నీటుకత్తెవటవే

(॥మగఁ॥)
ముప్పిరిఁ జెంగలించేవు ముద్దులెల్లా గునిసేవు
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డేలెనంటాను
వొప్పుగఁ గూడె నన్నితఁ డూఁకొని వినవే నీవు
కప్పురము చల్లేవు కతకారివటవే

(||pallavi||)
magam̐ ḍemī nanam̐ḍaṁṭā malasevu kĕlasevu
yĕgasakkelāḍevāri nĕṁchugovugadave

(||magam̐||)
paṁtamulu mĕrasevu pagabaganavvevu
maṁtanāna ramaṇum̐ḍu manniṁchĕnaṁṭā
sĕṁtanunna vārilonu siggavaḍa viṁchugaṁtā
yĕṁtaledu nībagaḍu yĕmmĕlām̐ḍivaḍave

(||magam̐||)
sārĕsārĕ māḍāḍevu sannalu movim̐jesevu
seri nīsana nādam̐ḍu sĕlliṁchĕnaṁṭā
yīrīdi nillāṁḍlagu viṁtaraṭṭu galadā
nerabulĕllām̐jūbevu nīḍugattĕvaḍave

(||magam̐||)
muppirim̐ jĕṁgaliṁchevu muddulĕllā gunisevu
yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍelĕnaṁṭānu
vŏppugam̐ gūḍĕ nannidam̐ ḍūm̐kŏni vinave nīvu
kappuramu sallevu kadagārivaḍave