Madhuraadi madhuram.. mana prema madhuvu

మధురాతి మధురం.. మన ప్రేమ మధువు
Year
Language

పల్లవి:

మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండలేదు .. తమి తీరలేదు

మధురాతి మధురం మన ప్రేమ మధువు
మది నిండునోయి .. తమి చేరునోయి

చరణం 1:

నిను వీణ చేసి .. కొనగోట మీటి .. అనురాగ గీతాలే .. పలికించనా !
ఆ పాటలోని .. భావాలు నీవై .. నీలోని వలపు .. నాలోన నిలుపు !!

చరణం 2:

చిరు కోర్కెలేవో ..చిగురించ సాగే .. ఎదలోన ఆశా ... ఊరించ సాగే !
నీ ఆశలెన్ని .. విరబూయగానే .. పూమాల చేసి .. మెడలోన వేతు !!

చరణం 3:

నా గుడిలోనా .. గుడి కట్టినానూ
గుడిలోన దేవతలా .. నివసించవా
గుడిలోన ఉన్నా .. ఏద మీద ఉన్నా ..
నీ దేవి .. నీ కొరకే .. జీవించునులే ..

pallavi:

madhurādi madhuraṁ mana prema madhuvu
madi niṁḍaledu .. tami tīraledu

madhurādi madhuraṁ mana prema madhuvu
madi niṁḍunoyi .. tami serunoyi

saraṇaṁ 1:

ninu vīṇa sesi .. kŏnagoḍa mīḍi .. anurāga gīdāle .. paligiṁchanā !
ā pāḍaloni .. bhāvālu nīvai .. nīloni valabu .. nālona nilubu !!

saraṇaṁ 2:

siru korgĕlevo ..siguriṁcha sāge .. ĕdalona āśhā ... ūriṁcha sāge !
nī āśhalĕnni .. virabūyagāne .. pūmāla sesi .. mĕḍalona vedu !!

saraṇaṁ 3:

nā guḍilonā .. guḍi kaṭṭinānū
guḍilona devadalā .. nivasiṁchavā
guḍilona unnā .. eda mīda unnā ..
nī devi .. nī kŏrage .. jīviṁchunule ..