మదనుని బలాలివి మర్మములు గరఁచీని
(॥పల్లవి॥)
మదనుని బలాలివి మర్మములు గరఁచీని
యెదుటనుండి చెలికి యిచ్చకమే సేయరే
(॥మద॥)
చలరేఁగి పతిఁబాసి చింతతో నున్న సతికి
చిలుకలఁ జూపకురే చెలులాల
వలపు లతనికెక్కె వసివాడివుండేవేళ
కలువపూవులు దెచ్చి కానుక లియ్యకరే
(॥మద॥)
విరహతాపముచేత విసుగుతా నుండఁగాను
సురటి విసరి గాలి సోఁకించకురే
మరిగి రతికిఁ బలుమరు నేఁకరేటి దాని
అరిది కోవిల వనాలందు నాడించకురే
(॥మద॥)
వుమ్మగిలి జవ్వనాన నుసురసురై వున్నది
తుమ్మిదలున్న పొదలు దూరించకురే
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డిట్టె వచ్చి యీకెఁ గూడె
నెమ్మది సోబానఁ బాడి నేరుపులు చెప్పరే
(||pallavi||)
madanuni balālivi marmamulu garam̐sīni
yĕduḍanuṁḍi sĕligi yichchagame seyare
(||mada||)
salarem̐gi padim̐bāsi siṁtado nunna sadigi
silugalam̐ jūbagure sĕlulāla
valabu ladanigĕkkĕ vasivāḍivuṁḍeveḽa
kaluvabūvulu dĕchchi kānuga liyyagare
(||mada||)
virahadābamuseda visugudā nuṁḍam̐gānu
suraḍi visari gāli som̐kiṁchagure
marigi radigim̐ balumaru nem̐kareḍi dāni
aridi kovila vanālaṁdu nāḍiṁchagure
(||mada||)
vummagili javvanāna nusurasurai vunnadi
tummidalunna pŏdalu dūriṁchagure
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ vachchi yīgĕm̐ gūḍĕ
nĕmmadi sobānam̐ bāḍi nerubulu sĕppare