Madanu bamdaaramu maguva menu

మదను బండారము మగువ మేను
Language

(॥పల్లవి॥)
మదను బండారము మగువ మేను
పొదిగొన్న వలపులఁ బొసఁగెఁ గాన

(॥మద॥)
మరునియాయుధశాల మగువకొప్పు
తొరలించి విరులెల్లాఁ దురిమెఁగాన
యిరవై కీరపు(ము?) లాయ మీసెగళము
సరసపుమాఁటలెల్లా జరసెఁగాన

(॥మద॥)
కామునిసాము గరిడి కాంతవురము
ఆమనిచనుసంగడా లమరెఁగాన
ప్రేమపుఁగేళాకూళి గంభీరనాభి
తేమచెమటలచేత దిగుపారెఁగాన

(॥మద॥)
కాంతునివేఁటపొలము కన్నె పిఱుఁదు
బంతి మొలనూళ్ళపోఁగు వారెఁగాన
అంతటివానితల్లి యీయల మేల్మంగ
యింతో శ్రీవేంకటేశు నెనసెఁగాన

(||pallavi||)
madanu baṁḍāramu maguva menu
pŏdigŏnna valabulam̐ bŏsam̐gĕm̐ gāna

(||mada||)
maruniyāyudhaśhāla maguvagŏppu
tŏraliṁchi virulĕllām̐ durimĕm̐gāna
yiravai kīrabu(mu?) lāya mīsĕgaḽamu
sarasabumām̐ṭalĕllā jarasĕm̐gāna

(||mada||)
kāmunisāmu gariḍi kāṁtavuramu
āmanisanusaṁgaḍā lamarĕm̐gāna
premabum̐geḽāgūḽi gaṁbhīranābhi
temasĕmaḍalaseda digubārĕm̐gāna

(||mada||)
kāṁtunivem̐ṭabŏlamu kannĕ piṟum̐du
baṁti mŏlanūḽḽabom̐gu vārĕm̐gāna
aṁtaḍivānidalli yīyala melmaṁga
yiṁto śhrīveṁkaḍeśhu nĕnasĕm̐gāna