Machcharabudaanamgaanu mannimchu sittaanam betti

మచ్చరపుదానఁగాను మన్నించు చిత్తానఁ బెట్టి
Language

(॥పల్లవి॥)
మచ్చరపుదానఁగాను మన్నించు చిత్తానఁ బెట్టి
మచ్చికలు రేఁచి నిన్ను మరుగుదుఁ గాని

(॥మచ్చ॥)
చనవుగలదంటాను సాదించనేను
ననపు గలదంటాను నాటించ గొరు
మనసెరుఁగుదునంటా మందెమేళము సేయను
వినయముతోడుతను వేఁడుకొందుఁగాని

(॥మచ్చ॥)
పంతగత్తెనంటాను బలిమి చూపను నేను
అంతరంగురాలనంటా నట్టె సొలయ
యింతటి దాననంటాను యెమ్మె నెరప
చెంతనుండి వావి చెప్పి చెనకుదుఁగాని

(॥మచ్చ॥)
చుట్టపు దాననంటాను సొలయనేను
దిట్టనంటా మొక్కలాన దీకొన నేను
యిట్టె శ్రీవేంకటేశ నన్నేలితివంటా గర్వించ
పట్టపు దేవులనై నీ బడినుందుఁగాని

(||pallavi||)
machcharabudānam̐gānu manniṁchu sittānam̐ bĕṭṭi
machchigalu rem̐si ninnu marugudum̐ gāni

(||machcha||)
sanavugaladaṁṭānu sādiṁchanenu
nanabu galadaṁṭānu nāḍiṁcha gŏru
manasĕrum̐gudunaṁṭā maṁdĕmeḽamu seyanu
vinayamudoḍudanu vem̐ḍugŏṁdum̐gāni

(||machcha||)
paṁtagattĕnaṁṭānu balimi sūbanu nenu
aṁtaraṁgurālanaṁṭā naṭṭĕ sŏlaya
yiṁtaḍi dānanaṁṭānu yĕmmĕ nĕraba
sĕṁtanuṁḍi vāvi sĕppi sĕnagudum̐gāni

(||machcha||)
suṭṭabu dānanaṁṭānu sŏlayanenu
diṭṭanaṁṭā mŏkkalāna dīgŏna nenu
yiṭṭĕ śhrīveṁkaḍeśha nannelidivaṁṭā garviṁcha
paṭṭabu devulanai nī baḍinuṁdum̐gāni