Maayalela raaraa managemti kaluga

మాయలేల రారా మనకేఁటి కలుక
Language

(॥పల్లవి॥)
మాయలేల రారా మనకేఁటి కలుక
పోయినవల్లాఁ బొల్లు పొద్దువోయ నిఁకను

(॥మాయ॥)
పలికితే దోసమా పలుమారుఁ బిలువఁగ
యెలమిని పరకాంత లీడ నున్నారా
వలతునందువు నాకు వారివీరితోడ నేల
కలది లేని దిఁదే కానవచ్చె నాకు

(॥మాయ॥)
చూచితేనే దోసమా నే చొక్కి యెదుట నుండఁగ
నాచుబొమ్మచారితనము దప్పీనా
యేచి మనకూట మిఁక నిందరును మెత్తరు
తాచి నేఁడు ఇందులోనే తారుకాఁలాయఁగా

(॥మాయ॥)
మనసిచ్చితే దోసమా మంచిమాట లాడఁగాను
మినుకునీజవ్వనము మీఁదువోయీనా
చెనకఁగఁ గూడితివి శ్రీ వేంకటేశ నన్ను
మునిపితే ముయాయ మోహ మెందుఁ గలదే

(||pallavi||)
māyalela rārā managem̐ṭi kaluga
poyinavallām̐ bŏllu pŏdduvoya nim̐kanu

(||māya||)
paligide dosamā palumārum̐ biluvam̐ga
yĕlamini paragāṁta līḍa nunnārā
valadunaṁduvu nāgu vārivīridoḍa nela
kaladi leni dim̐de kānavachchĕ nāgu

(||māya||)
sūsidene dosamā ne sŏkki yĕduḍa nuṁḍam̐ga
nāsubŏmmasāridanamu dappīnā
yesi managūḍa mim̐ka niṁdarunu mĕttaru
tāsi nem̐ḍu iṁdulone tārugām̐lāyam̐gā

(||māya||)
manasichchide dosamā maṁchimāḍa lāḍam̐gānu
minugunījavvanamu mīm̐duvoyīnā
sĕnagam̐gam̐ gūḍidivi śhrī veṁkaḍeśha nannu
munibide muyāya moha mĕṁdum̐ galade