Maarumaada lamta nera mari vinnabaalu nera

మారుమాట లంత నేర మరి విన్నపాలు నేర
Language

(॥పల్లవి॥)
మారుమాట లంత నేర మరి విన్నపాలు నేర
శ్రీరామచందురుని చిత్త మింతేకాక

(॥మారు॥)
కన్నుల నెదురుచూచి కరఁగేటిదానఁ గాక
సన్నసేసి పిలువను సరిదాననా
మన్నించి తాఁజూచితేను మనసిచ్చేదానఁ గాక
అన్నీటా నే నెడమాట లాడించేదాననా

(॥మారు॥)
ఆనవాలుగా నుంగర మందుకొనేఁ గాక
నేనే పైకొన నంతనీటుదాననా
పూని తా విచ్చేసితేను పొడగనేదానఁ గాక
కానుకలు సారె నంపి కాఁక రేఁచే దాననా

(॥మారు॥)
సోదించి నన్నుఁ గూడితే చొక్కేటిదానఁగాక
కాదుకూడదని దూరఁ గడదాననా
సాదించి వావిలిపాటిజయరామ యేలితివి
ఆదియై శ్రీ వేంకటాద్రి నంతదాననా

(||pallavi||)
mārumāḍa laṁta nera mari vinnabālu nera
śhrīrāmasaṁduruni sitta miṁtegāga

(||māru||)
kannula nĕdurusūsi karam̐geḍidānam̐ gāga
sannasesi piluvanu saridānanā
manniṁchi tām̐jūsidenu manasichchedānam̐ gāga
annīḍā ne nĕḍamāḍa lāḍiṁchedānanā

(||māru||)
ānavālugā nuṁgara maṁdugŏnem̐ gāga
nene paigŏna naṁtanīḍudānanā
pūni tā vichchesidenu pŏḍaganedānam̐ gāga
kānugalu sārĕ naṁpi kām̐ka rem̐se dānanā

(||māru||)
sodiṁchi nannum̐ gūḍide sŏkkeḍidānam̐gāga
kādugūḍadani dūram̐ gaḍadānanā
sādiṁchi vāvilibāḍijayarāma yelidivi
ādiyai śhrī veṁkaḍādri naṁtadānanā