Maarumaada laadagure magudi naadanidonu

మారుమాట లాడకురే మగుడి నాతనితోను
Language

(॥పల్లవి॥)
మారుమాట లాడకురే మగుడి నాతనితోను
చేరి చెప్పినట్టెల్లాఁ జేసే నేను

(॥మారు॥)
చలపాదితనమే సాజమైనవాఁడు
వలచితే విడుచునా వనితలను
పెలుచుఁదనాలకెల్ల పెంటవట్టయినవాఁడు
వొలిసి విరహమున కోరువఁగలఁడా

(॥మారు॥)
వుద్దండపుచేఁతలకే వొడిగట్టినవాఁడు
గద్దించితే మానునా కాంతలనెల్ల
పొద్దుపొద్దు మాయలచే పోదికాఁడయిన వాఁడు
అద్దుకొన్న ప్రియాలెల్లా నాడి పొందకుండునా

(॥మారు॥)
తమకమే వొకరూపై తనివినొందని వాఁడు
జమళిఁ గూడకుండునా సతులఁగంటే
అమర శ్రీవేంకటేశుఁ డన్నిటా నన్ను నేలె
సమమోహములు పైపైఁ జల్లుకొనవలదా

(||pallavi||)
mārumāḍa lāḍagure maguḍi nādanidonu
seri sĕppinaṭṭĕllām̐ jese nenu

(||māru||)
salabādidaname sājamainavām̐ḍu
valaside viḍusunā vanidalanu
pĕlusum̐danālagĕlla pĕṁṭavaṭṭayinavām̐ḍu
vŏlisi virahamuna koruvam̐galam̐ḍā

(||māru||)
vuddaṁḍabusem̐talage vŏḍigaṭṭinavām̐ḍu
gaddiṁchide mānunā kāṁtalanĕlla
pŏddubŏddu māyalase podigām̐ḍayina vām̐ḍu
addugŏnna priyālĕllā nāḍi pŏṁdaguṁḍunā

(||māru||)
tamagame vŏgarūbai tanivinŏṁdani vām̐ḍu
jamaḽim̐ gūḍaguṁḍunā sadulam̐gaṁṭe
amara śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā nannu nelĕ
samamohamulu paibaim̐ jallugŏnavaladā