మానవుని వోజలు మరి యెవ్వరు చెప్పినా
(॥పల్లవి॥)
మానవుని వోజలు మరి యెవ్వరు చెప్పినా
నానఁబెట్టి యేతుల నడపేవుగాని
(॥మాన॥)
నయగారితనమున నాలి నీమాటలకేల
ప్రియమంది మోహించి బేలనైతిని
క్రియ యెఱఁగక నీవు కిమ్ములవారిఁ దెచ్చి
బయలీఁదింపుచు మముఁ బఱచేవుగాని
(॥మాన॥)
మతకారి సరసపు మచ్చిక నీమాయకే
ఇతవుగాఁ బైకొని యెడ్డనైతివి
చతురతలేక నీవుసరిగా నెవ్వతోఁ దెచ్చి
కుతిలపెట్టి గో రాదిగొనేవుగాక
(॥మాన॥)
సటకారి నీమోవిచాయలనవ్వులకే
తటుకున నినుఁగూడి దంటనైతిని
నటన శ్రీవేంకటనాయక నీవాకెఁ దెచ్చి
కిటుకుదీర మొక్కించి కేరించేవుగాని
(||pallavi||)
mānavuni vojalu mari yĕvvaru sĕppinā
nānam̐bĕṭṭi yedula naḍabevugāni
(||māna||)
nayagāridanamuna nāli nīmāḍalagela
priyamaṁdi mohiṁchi belanaidini
kriya yĕṟam̐gaga nīvu kimmulavārim̐ dĕchchi
bayalīm̐diṁpusu mamum̐ baṟasevugāni
(||māna||)
madagāri sarasabu machchiga nīmāyage
idavugām̐ baigŏni yĕḍḍanaidivi
saduradalega nīvusarigā nĕvvadom̐ dĕchchi
kudilabĕṭṭi go rādigŏnevugāga
(||māna||)
saḍagāri nīmovisāyalanavvulage
taḍuguna ninum̐gūḍi daṁṭanaidini
naḍana śhrīveṁkaḍanāyaga nīvāgĕm̐ dĕchchi
kiḍugudīra mŏkkiṁchi keriṁchevugāni