మానవయ్య మాతోడి మందెమేళాలు
(॥పల్లవి॥)
మానవయ్య మాతోడి మందెమేళాలు
సానఁబట్టేవు పంతాలు సతులపై నేలయ్యా
(॥మాన॥)
వా(వ్రా)యవయ్య చెక్కులపై వలపులవాఁ(వ్రా)తలు
యేయెడనీసతిపై యెఁ(యెం)దైనాఁ బోయి
ఆయము దాఁకీ మాకు నంతేసి కోపము నీ-
చేయి వూరకుండకుంటే చిమ్మవయ్య బయలు
(॥మాన॥)
ఆడవయ్యా నీనోర నలపెండ్లిమాటలు
యీడ నాడ సతులపై నెఁ(నెం)దైనాఁ బోయి
వీదెపు మాసెలవుల విచ్చిచెప్పఁజాలము
ఆడుకొన వేడుకైతే నటు ముంటాఁ బోవయ్యా
(॥మాన॥)
అందువయ్య చేయిచాఁచి అంగజమర్మములు నీ-
విందు రాకుంటేఁ జాలు నెఁదైనాఁ బోయి
కందువ శ్రీవేంకటేశ కాఁగిట న న్నేలితి నీఁ
వందుకోలుజాణవైతే నట్లే కానీవయ్యా
(||pallavi||)
mānavayya mādoḍi maṁdĕmeḽālu
sānam̐baṭṭevu paṁtālu sadulabai nelayyā
(||māna||)
vā(vrā)yavayya sĕkkulabai valabulavām̐(vrā)talu
yeyĕḍanīsadibai yĕm̐(yĕṁ)dainām̐ boyi
āyamu dām̐kī māgu naṁtesi kobamu nī-
seyi vūraguṁḍaguṁṭe simmavayya bayalu
(||māna||)
āḍavayyā nīnora nalabĕṁḍlimāḍalu
yīḍa nāḍa sadulabai nĕm̐(nĕṁ)dainām̐ boyi
vīdĕbu māsĕlavula vichchisĕppam̐jālamu
āḍugŏna veḍugaide naḍu muṁṭām̐ bovayyā
(||māna||)
aṁduvayya seyisām̐si aṁgajamarmamulu nī-
viṁdu rāguṁṭem̐ jālu nĕm̐dainām̐ boyi
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍa na nnelidi nīm̐
vaṁdugolujāṇavaide naṭle kānīvayyā