Maanavachchunaa neevu mannimchamgaa

మానవచ్చునా నీవు మన్నించఁగా
Language

(॥పల్లవి॥)
మానవచ్చునా నీవు మన్నించఁగా
సేనలుగా సేవలు సేసేమయ్యా

(॥మాన॥)
పెనఁగఁగవచ్చునాప్రియపడి నీవు రాఁగా
కినియఁగవచ్చునా కేలు చాఁగఁగ
అనుమానించవచ్చునా ఆయమునీవంటఁగాను
చెనకి నీ చెప్పినట్లు సేసేమయ్యా

(॥మాన॥)
కసరఁగవచ్చునా కప్పురము నీవియ్యఁగ
కొసరంగవచ్చునా కూడేననంగ
విసుగఁగవచ్చునా వేఁడుకతో మాటాడఁగ
పసలుగా నిన్నట్టె పాయకుండేమయ్యా

(॥మాన॥)
తలవంచవచ్చునా తప్ప కిట్టె చూడఁగాను
చలపట్టవచ్చునా చౌలు చూపఁగ
యెలమి శ్రీవేంకటేశ ఇట్టె నన్నునేలితివి
కలకాలమును నిన్నుఁ గడుమెచ్చేమయ్యా

(||pallavi||)
mānavachchunā nīvu manniṁcham̐gā
senalugā sevalu sesemayyā

(||māna||)
pĕnam̐gam̐gavachchunāpriyabaḍi nīvu rām̐gā
kiniyam̐gavachchunā kelu sām̐gam̐ga
anumāniṁchavachchunā āyamunīvaṁṭam̐gānu
sĕnagi nī sĕppinaṭlu sesemayyā

(||māna||)
kasaram̐gavachchunā kappuramu nīviyyam̐ga
kŏsaraṁgavachchunā kūḍenanaṁga
visugam̐gavachchunā vem̐ḍugado māḍāḍam̐ga
pasalugā ninnaṭṭĕ pāyaguṁḍemayyā

(||māna||)
talavaṁchavachchunā tappa kiṭṭĕ sūḍam̐gānu
salabaṭṭavachchunā saulu sūbam̐ga
yĕlami śhrīveṁkaḍeśha iṭṭĕ nannunelidivi
kalagālamunu ninnum̐ gaḍumĕchchemayyā